Asianet News TeluguAsianet News Telugu

గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ ఊర మాస్ డాన్స్ చూశారా?.. వీడియో ఇదిగో

Virat Kohli dance video : ఫైన‌ల్ మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికాను ఓడించింది టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఛాంపియ‌న్ గా నిలిచింది టీమిండియా. ఆ అద్భుత క్ష‌ణాల్లో టీమిండియా ప్లేయ‌ర్ల‌తో పాటు యావ‌త్ భార‌తావ‌ని తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఆ ఆనంద కన్నీళ్లు తగ్గిన తర్వాత, టీ20 ప్రపంచ కప్ విజయాన్ని భారత్ జరుపుకునే సమయం వచ్చింది. దీంతో టీమిండియా ప్లేయ‌ర్ల‌తో క‌లిసి విరాట్ కోహ్లీ గ్రౌండ్ ఊర‌ మాస్ అనిపించే డాన్స్ తో అద‌ర‌గొట్టాడు.
 

Virat Kohli wowed with Bhangra dance, he rocked the stage with Arshdeep and Rinku Singh, Here's the video RMA
Author
First Published Jun 30, 2024, 11:47 AM IST

Virat Kohli dance video : 17  ఏండ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ టీమిండియా రెండో సారి టీ20 ప్రపంచ క‌ప్ ను అందుకుంది. ఫైన‌ల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఛాంపియ‌న్ గా భార‌త జ‌ట్టు నిలిచింది. ఈ ఆనంద క్ష‌ణాల్లో భార‌త ఆట‌గాళ్లు ఎమోష‌న‌ల్ అవుతూ క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఈ  ఆనంద కన్నీళ్లు తగ్గిన తర్వాత, టీ20 ప్రపంచ కప్ విజయాన్ని భారత్ జరుపుకునే సమయం వచ్చింది. ఈ సంబురాలు చేసుకోవ‌డంలో విరాట్ కోహ్లీని మించిన వారు లేరు. వేడుక చేసుకునే ఏ అవకాశాన్ని వదులుకోలేదు. స్టేడియంలో ఏదైనా పాట ప్లే చేసినా.. ఫీల్డింగ్ చేస్తూనే డ్యాన్స్ చేయడం ప్రారంభించే కింగ్ కోహ్లీ.. ఇక భార‌త్ ఛాంపియ‌న్ గా నిలిచిందంటే ఊరుకుంటాడా.. ! గ్రౌండ్ లోనే ఊర‌మాస్ డాన్స్ తో అద‌ర‌గొడుతూ సంబ‌రాలు చేసుకున్నారు.

భాంగ్రాతో విరాట్ కోహ్లీ సంబురాలు.. 

మ‌రీ ముఖ్యంగా పంజాబీ మ్యూజిక్ కు భాంగ్రాతో దుమ్మురేపాడు. కోహ్లి, అర్ష్‌దీప్ సింగ్ టీ20 ప్రపంచకప్ విజయాన్ని పూర్తిగా పంజాబీ స్టైల్‌లో జరుపుకున్నారు. బార్బడోస్‌లో ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ ప్రసిద్ధ పాట 'తునక్ తునక్ తున్'కి డ్యాన్స్ చేస్తూ కనిపించారు, ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు పరుగులతో అద్భుత విజయం సాధించిన  త‌ర్వాత‌ ఇద్దరు హీరోలు తమ చుట్టూ గెలిచిన పతకాలతో భాంగ్రా స్టెప్పులు వేశారు. విరాట్-అర్ష్ దీప్ సింగ్ భాంగ్రాతో స్టేడియంలో హోరెత్తించారు. వారిద్దరితో పాటు అక్షర్ పటేల్, రింకూ సింగ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు కూడా డాన్స్ చేశారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

 

ఫైనల్‌లో అద్భుతం చేసిన కింగ్ కోహ్లీ.. 

గ్రూప్ స్టేజ్, సూపర్ 8, సెమీ-ఫైనల్స్ ఇలా ప్ర‌తి మ్యాచ్ లోనూ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విష‌యంలో విఫ‌ల‌మ‌వుతూనే వ‌చ్చాడు. కానీ, కీల‌క‌మైన మూడు వికెట్లు కోల్పోయిన క‌ష్ట స‌మ‌యంలో అద్భుత‌మైన ఆట‌తో ఫైన‌ల్ టీమిండియాకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ ఫైనల్ ప్ర‌ద‌ర్శ‌న టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. 59 బంతుల్లో 76 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47 పరుగులు), శివమ్ దూబే (16 బంతుల్లో 27 పరుగులు) రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేశాడు. బౌలింగ్ లో బుమ్రా, అర్ష్ దీప్, హార్దిక్ పాండ్యాలు రాణించ‌డంతో ద‌క్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 169 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో భార‌త్ ఏడు ప‌రుగుల తేడాతో గెలిచి ఛాంపియ‌న్ గా నిలిచింది.

 

 

అప్పుడు శ్రీశాంత్.. ఇప్పుడు సూర్య‌కుమార్ యాద‌వ్.. హిస్ట‌రీలో నిలిచే క్యాచ్ ఇది 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios