సారాంశం
Suryakumar Yadav Super catch : దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ కైవసం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ప్రోటీస్ జట్టును ఓడించి 2007 తర్వాత టీ20 ప్రపంచకప్ ను రెండో సారి అందుకుంది.
Suryakumar Yadav Super catch : టీమిండియా చరిత్ర సృష్టించింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీ20 ప్రపంచ కప్ లో ఛాంపియన్ గా నిలిచిన జట్టుగా ఘతన సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ కైవసం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2007 తర్వాత టీ20 ప్రపంచకప్ టైటిల్ ను భారత్ రెండో సారి సాధించింది. 2011 తర్వాత ప్రపంచకప్‌ను ఎగరేసే అవకాశంలో అప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడం విశేషం. ఆ తర్వాత 2013లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఐసీసీ ట్రోఫీ కోసం 11 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా అందని ద్రాక్షగానే మిగిలింది. కానీ, 2024లో ఈ కల నిజమైంది. అద్భుత కమ్ బ్యాక్ తో విజయాన్ని అందుకుంది.
అయితే, టీమిండియా విజయంలో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ మలపుతిప్పే సూపర్ క్యాచ్ తో అదరగొట్టాడు. ఈ ప్రపంచ కప్ లో మంచి ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం తన బ్యాట్‌తో ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాడు. కానీ దక్షిణాఫ్రికా బ్యాటింగ్ సమయంలో చివరి ఓవర్‌లో అద్భుతమైన క్యాచ్ ను అందుకుని మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దక్షిణాఫ్రికా 6 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది. బ్యాటింగ్ లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడే డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయగా.. బిగ్ షాట్ కొట్టాడు. దీంతో బంతి బౌండరీ దాటి పోతుందని అనిపించినా క్షణాల్లో మధ్యలోకి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. అయితే, బౌండరీలైన్ దాటే పరిస్థితిలో ఉండటంతో మళ్లీ బంతిని గాళ్లోకి విసిరాడు. ఇప్పుడు గ్రౌండ్ లోకి వచ్చి బంతిని అందుకుని క్యాచ్‌ని రెండు ప్రయత్నాల్లో పూర్తి చేశాడు.
హార్దిక్ పాండ్యాను ముద్దు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో
కపిల్ దేవ్, శ్రీశాంత్ తర్వాత సూర్యకుమార్..
సూర్య కుమార్ యాదవ్ పట్టిన ఈ మిల్లర్ క్యాచ్ తో మ్యాచ్ మలుపు తిరిగింది. అతని ఈ క్యాచ్ 1983 ప్రపంచకప్ ఫైనల్‌లో కపిల్ దేవ్, 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఎస్ శ్రీశాంత్‌ల క్యాచ్‌లను గుర్తుచేసింది. వెస్టిండీస్ గ్రేట్ బ్యాట్స్‌మెన్ వివియన్ రిచర్డ్స్‌కి కపిల్ దేవ్ క్యాచ్ ఇవ్వగా, శ్రీశాంత్ పాకిస్థాన్ ఆటగాడు మిస్బా-ఉల్-హక్ క్యాచ్ పట్టి ఆ సమయంలో భారత్ ను ఛాంపియన్ గా నిలిపారు. ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ పట్టిన డేవిడ్ మిల్లర్ క్యాచ్ లో మ్యాచ్ ను భారత్ వైపు తీసుకువచ్చాడు. క్రికెట్ హిస్టారీలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్యాచ్ పట్టి టీమిండియాను విజేతగా నిలిపాడు. సూర్యక్యాచ్ పై క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఈ విజయం తర్వాత ఇర్ఫాన్ పఠాన్ భావోద్వేగానికి గురయ్యాడు. సూర్యకుమార్‌ను ప్రశంసిస్తూ.. సూర్య క్యాచ్‌ని ఎప్పటికీ మరిచిపోలేను.. అది నా ఆఖరి ఊపిరి అయినా నాకు గుర్తుండే ఉంటుందని ఏమోషనల్ అయ్యారు.
Virat Kohli : ఫ్యాన్స్ కు గుండెలు పగిలే న్యూస్ చెప్పిన విరాట్ కోహ్లీ
ఫైనల్లో విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్.. లేకపోతే టీమిండియా సంగతి అంతే.. !