రికార్డుల రారాజు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ మ్యాచ్‌కి కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంటూ పోతున్నాడు. తాజాగా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడి పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్ధలుకొట్టాడు.

Also Read:తొలి వన్డేలో రికార్డుల మోత: వీరేంద్రుడి తర్వాత అయ్యరే, ఇంకా మరెన్నో

న్యూజిలాండ్‌తో హామిల్టన్‌లో జరిగిన తొలి వన్డేలో అర్థశతకం సాధించిన విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వన్డేల్లో అత్యథిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో దాదాను వెనక్కినెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు.

సారథిగా సౌరవ్ గంగూలీ 142 ఇన్నింగ్సుల్లో 5,082 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కేవలం 83 ఇన్నింగ్సుల్లోనే 5,123 పరగులు చేశాడు. ఎంఎస్ ధోనీ  6,641, మహ్మద్ అజారుద్దీన్ 5,239 పరుగులతో కోహ్లీ కంటే ముందున్నారు.

Also Read:అండర్ 19 వరల్డ్ కప్ : భారత్ చేతిలో పాక్ చిత్తు.. కారణం ఇదే

అయితే విరాట్ స్పీడును చూస్తుంటే త్వరలోనే ధోనీని దాటి నెంబర్‌వన్ ప్లేస్‌ను కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో 20 నుంచి 30 ఇన్నింగ్సుల్లో కోహ్లీ.. మహేంద్రుడిని నెట్టేస్తాడని క్రీడా విశ్లేషకుల అంచనా.