టీమిండియాకు కీలక ఆటగాడిగా మారిన శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో 107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌తో 103 పరుగులతో కెరీర్‌లో తొలి వన్డే శతకం సాధించిన అయ్యర్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

హామిల్టన్‌లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ కంటే ముందే భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అజేయంగా 125 పరుగులు చేశాడు.

Also Read:పాక్ ను చిత్తు చేసిన యశస్వీ జైశ్వాల్ ఓ పానీపూరీ సెల్లర్

ఇదే ఇక్కడ టీమిండియా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు. నిన్నటి వరకు సెకండ్ ప్లేస్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ 100 ఉండేవాడు. తాజాగా శ్రేయస్ అయ్యర్ మంగళవారం సెంచరీ చేసి గబ్బర్‌ను వెనక్కిపంపాడు.

ఇకపోతే హామిల్టన్‌లో భారత్ తరపున అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన మూడో జోడిగా శ్రేయస్ అయ్యర్-కేఎల్ రాహుల్ నిలిచారు. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 136 పరుగులు జోడించారు. వీరికంటే ముందు సెహ్వాగ్-గంభీర్‌లు 201 పరుగులు, ధావన్-రోహిత్ శర్మ 174 పరుగులు చేశారు. 2014లో ధోని-రవీంద్ర జడేజా అజేయంగా ఆరో వికెట్‌కు 127 పరుగులు చేసి నాలుగో జంటగా నిలిచారు.

Also Read:అండర్ 19 వరల్డ్ కప్ : భారత్ చేతిలో పాక్ చిత్తు.. కారణం ఇదే

ఇక మరో రికార్డు విషయానికి వస్తే సెడాన్ పార్క్‌లో వెస్టిండీస్ 363 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉండగా... ఇవాళ్టీ మ్యాచ్‌తో భారత్ రెండో స్థానంలో, 346 పరుగులతో ఆసీస్ మూడో స్థానంలో ఉంది.