కరోనా కారణంగా ఈసారి ఐపీఎల్ యూఏఈలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీస్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.

అయితే 12 సీజన్ల నుంచి పేపర్‌పై బలంగా కనిపిస్తూ చివరికి వచ్చే సరికి పేలవ ప్రదర్శన చేసే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌ను ఈసారైనా అదృష్టం వరిస్తుందో లేదోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ఆర్‌సీబీ కెప్టెన్ కోహ్లీ కొత్త బ్యాటింగ్ కిట్‌పై ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. కిట్ బాగుంది కానీ.. ఈసారైనా టైటిల్ తీసుకొస్తావా అంటూ పేర్కొంటున్నారు. కరోనా వల్ల దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరంగా ఉన్న కోహ్లీ మాత్రం ఐపీఎల్‌కు సన్నద్దమవుతున్నాడు.

Also Read:ఐపీఎల్ నిర్వహణపై రాని స్పష్టత, సమావేశం తరువాతైనా వచ్చేనా..?

లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటూ పూర్తిగా ఫిట్‌నెస్‌పైనే దృష్టి సారించిన కోహ్లీ ఇప్పుడు సీరియస్‌గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇదే తరహాలో భారత క్రికెటర్లు రిషబ్ పంత్, సురేశ్ రైనా, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ తమ ప్రాక్టీస్ వీడియోలను షేర్ చేసుకున్నారు.

ఐపీఎల్ 13వ సీజన్ గెలిచే అవకాశాలు కోహ్లీ నేతృత్వంలోని ఆర్‌సీబీ జట్టుకు పుష్కలంగా ఉన్నాయంటూ మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

Also Read:ఐపీఎల్ కి అభిమానులకు ఎంట్రీ, ప్రభుత్వ అనుమతే తరువాయి..!

టీ 20 ప్రపంచకప్ వాయిదా నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్‌ను సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ నిర్వహణ, షెడ్యూల్, మ్యాచ్ వివరాలపై రేపు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది.