Asianet News TeluguAsianet News Telugu

U-19 World Cup: న్యూజిలాండ్‌ను ఢీకొనేందుకు సిద్ధ‌మైన భారత్.. లైవ్ స్ట్రీమింగ్ మ్యాచ్ టైమ్ ఇదే..

IND-U19 vs NZ-U19: అండర్-19 ప్రపంచకప్ లో ఉదయ్ సహారన్ కెప్టెన్సీలో భారత జ‌ట్టు గ్రూప్ దశలోని అన్ని మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి సూపర్ సిక్స్ కు చేరింది. సూపర్ సిక్స్ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది. 
 

U19 World Cup: India's first match against New Zealand in super six, live streaming, match time details are here RMA
Author
First Published Jan 30, 2024, 11:17 AM IST | Last Updated Jan 30, 2024, 11:18 AM IST

icc under-19 cricket world cup 2024: అండర్-19 ప్రపంచకప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. ఉదయ్ సహారన్ కెప్టెన్సీలో భారత జ‌ట్టు గ్రూప్ దశలోని అన్ని మ్యాచ్ ల్లోనూ విజయం సాధించి సూపర్ సిక్స్ కు చేరింది. సూపర్ సిక్స్ తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ తో భారత్ ఆడనుంది. మాంగాంగ్ ఓవల్ లోని బ్లోమ్‌ఫోంటెయిన్ లో ఈ మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్ 2024లో ఒకవైపు భారత్ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ విజయం సాధించింది. ఫుల్ జోష్ లో కీవిస్ జట్టుతో పోటీకి సిద్ధమైంది. తన జైత్రయాత్రను కొనసాగించాలని చూస్తోంది. 

అలాగే, న్యూజిలాండ్ జట్టు 3 మ్యాచ్ లలో 2 విజయాలతో సూపర్ సిక్స్ దశకు చేరుకుంది.  భారత్ కు శుభవార్త ఏంటంటే మూడు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించిన మైదానంలోనే సూపర్ సిక్స్ మ్యాచ్ కూడా జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

విరాట్ జంపింగ్.. బుమ్రా బౌలింగ్ ! మ్యాచ్‌ని మలుపు తిప్పిన కింగ్ కోహ్లీ.. !

అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ జైత్రయాత్ర

ఉదయ్ సహారన్ సార‌థ్యంలోని టీమిండియా జోరును ప్ర‌ద‌ర్శిస్తోంది. అండర్-19 వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఆడిన అన్ని గ్రూప్ మ్యాచ్ ల్లోనూ భారత్ విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో భారత్ 84 పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది. రెండో మ్యాచ్ లో ఐర్లాండ్ పై 201 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్ లో అమెరికాపై భారత్ 201 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు తమ గ్రూప్ ద‌శ‌లో నేపాల్, అఫ్గానిస్థాన్ ల‌ను ఓడించి సూపర్ సిక్స్ కు అర్హత సాధించింది. అయితే, చివరి గ్రూప్ మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయింది. గ్రూప్ ద‌శ‌లో భారత్ అగ్రస్థానంలో నిలవగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది.

భారత్ vs న్యూజిలాండ్ అండర్-19, సూపర్ సిక్స్ వరల్డ్ కప్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా ఎక్కడ చూడాలి? 

భారత్ vs న్యూజిలాండ్ అండర్-19, సూపర్ సిక్స్ వరల్డ్ కప్ మ్యాచ్ ను డిస్నీ+ హాట్‌స్టార్ లో  ప్రత్యక్ష ప్ర‌సారం చూడ‌వ‌చ్చు. 

భారత్ vs న్యూజిలాండ్ అండర్-19, సూపర్ సిక్స్ వరల్డ్ కప్ మ్యాచ్ ను ఏ టీవీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అవుతుంది? 

భారత్-న్యూజిలాండ్ అండర్-19, సూపర్ సిక్స్ వరల్డ్ కప్ మ్యాచ్ ను భారత్ లో స్టార్ స్పోర్ట్స్ నెట్ వ‌ర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

విరాట్ జంపింగ్.. బుమ్రా బౌలింగ్ ! మ్యాచ్‌ని మలుపు తిప్పిన కింగ్ కోహ్లీ.. !

భారత్ vs న్యూజిలాండ్ అండర్-19 జ‌ట్లు ఇవే: 

భారత్ అండర్-19 జట్టు: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), ప్రియాన్షు మోలియా, సచిన్ దాస్, అరవేలి అవనీష్ (వికెట్ కీపర్), మురుగన్ అభిషేక్, నమన్ తివారీ, రాజ్ లింబానీ, సౌమ్య పాండే, అన్ష్ గోసాయి, ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రుద్ర పటేల్, ప్రేమ్ దేవ్‌కర్, మహ్మద్ అమన్, ఇనేష్ మహాజన్.

న్యూజిలాండ్ అండర్-19 జట్టు: టామ్ జోన్స్, ల్యూక్ వాట్సన్, స్నేహిత్ రెడ్డి, ఆలివర్ తెవాటియా, ఆస్కార్ జాక్సన్(కెప్టెన్), లాచ్లాన్ స్టాక్‌పోల్, జాక్ కమ్మింగ్, సామ్ క్లోడ్(వికెట్ కీప‌ర్), మాట్ రోవ్, ర్యాన్ సోర్గాస్, మాసన్ క్లార్క్, జేమ్స్ నెల్సన్, అలెక్స్ థాంప్సన్ ఎవాల్డ్ ష్రోడర్, రాబీ ఫౌల్క్స్.

#Devara:ఎన్టీఆర్ 'దేవర' తెలుగు థియేటర్ రైట్స్ వాళ్లకేనా, ఎంతకి డీల్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios