Asianet News TeluguAsianet News Telugu

#Devara:ఎన్టీఆర్ 'దేవర' తెలుగు థియేటర్ రైట్స్ వాళ్లకేనా, ఎంతకి డీల్

. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్   విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.   

Mythri Movies to acquire Ntr #Devara Telugu States Rights jsp
Author
First Published Jan 19, 2024, 10:26 AM IST | Last Updated Jan 19, 2024, 10:26 AM IST


జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. రీసెంట్ గా విడుదల చేసిన  దేవర గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లిప్స్ చూసిన వారంతా ఎన్టీఆర్ కెరియర్ లో దేవర బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల రైట్స్ కు ఓ రేంజిలో పోటీ నెలకొని ఉంది. 

అయితే ఈ రైట్స్ ని మైత్రీ మూవీస్ వారికే వెళ్లే అవకాసం ఉందంటున్నారు. డిస్ట్రిబ్యూషన్ లో వచ్చిన మైత్రీ వారు దిల్ రాజు కు పోటీ ఇస్తూ తమ కు వచ్చిన ఏ అవకాశం మిస్ చేసుకోవటం లేదు. హనుమాన్ , సలార్ లతో నైజాంలో సక్సెస్ చూసిన మైత్రీవారు దేవర రెండు రాష్ట్రాల తెలుగు రైట్స్ కోసం ట్రై చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఎన్టీఆర్, కొరటాల శివ, మైత్రీ మూవీస్ కు మంచి  rapport ఉండటం కలిసొచ్చే అంశం అని చెప్తున్నారు.

 గతంలో మైత్రీ  బ్యానర్ ని తెలుగులోకి కొరటాల శివ తమ శ్రీమంతుడు చిత్రంతో తెచ్చారు. అలాగే ఆ తర్వాత అదే కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్,మోహన్ లాల్ కాంబో లో జనతా గ్యారేజ్ అనే సూపర్ హిట్ కొట్టారు. దాంతో ఇప్పుడు తమ ఉన్న పరిచయం,స్నేహంతో దేవర రైట్స్ అడుగుతున్నారని చెప్తున్నారు.అలాగే ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయబోయే చిత్రానికి సైతం మైత్రీ వారే నిర్మాతలు కావటం విశేషం. దేవర తెలుగు రైట్స్ ని 110 కోట్లుకు అడుగుతున్నారని,బేరసారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క దేవర నిర్మాతలు 145 కోట్ల  థ్రియేటర్ బిజినెస్ ని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్సపెక్ట్ చేస్తున్నారు. 
 
 అలాగే ఈ చిత్రం  బిజినెస్ లో అతి కీలకమైన భాగం మంచి రేటుకు ఓటీటి రైట్స్ అమ్మడం. దేవర ఓటిటి రైట్స్ అమ్మేసామని అఫీషియల్ గా చెప్పారు కళ్యాణ్ రామ్.  దేవర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని  చెప్పారు. కేవలం తెలుగుకు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మళయాళం, హిందీ ఓటిటి రైట్స్ ఇవ్వటం జరిగింది. ఈ రైట్స్ కు ఏకంగా 150 కోట్లు పెట్టి దక్కించుకున్నట్టు తెలుస్తుంది. దీంతో  షూటింగ్ పూర్తి కాకుండానే ఓన్లీ డిజిటల్ రైట్స్ తోనే పెట్టుబడి సగం వచ్చినట్టు అయ్యింది.ఇది రికార్డ్ రేటు అని చెప్పవచ్చు.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుండగా , ఓటిటి స్ట్రీమింగ్ రిలీజ్ అయ్యిన 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ జరగనుంది. ప్యాన్ ఇండియా రిలీజ్ కావటంతో 8 వారాలు అని లేకపోతే 4 వారాల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యేదని చెప్తున్నారు. 
 
  దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్   విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.   ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios