ప్రత్యర్ధి ఆటగాళ్లు ఔటైనా.. లేక తాము గెలిచినా వెస్టిండీస్ క్రికెటర్లు మైదానంలో వెరైటీ విన్యాసాలు చేస్తూ ఉంటారు. కుప్పిగంతులో.. డ్యాన్సులో, దగ్గరకొచ్చి సెల్యూట్ చేయడమో చేస్తుంటారు. అయితే త్రివేండ్రంలో భారత్‌తో జరిగిన రెండో టీ20లో విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత విలియమ్స్ ఎటువంటి సంబరాలు చేసుకోలేదు.

ఔట్‌సైడ్ ఆఫ్ స్లో షార్ట్ పిచ్ బంతిని ఆడటంతో తడబడిన విరాట్ కోహ్లీ.. స్లో షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఈ సమయంలో విండీస్ క్రికెటర్లు సెలబ్రేషన్స్ చేసుకోలేదు.. ఇందుకు కారణం విలియమ్స్ సహచర ఆటగాళ్లకు విజ్ఞప్తి చేయడమే. కోహ్లీ ఔటైన వెంటనే విలియమస్ నోటిపై వేలు వేసుకుని మౌనంగా ఉండాల్సిందిగా సూచించాడు. 

Also Read:దిశ వాళ్లను కాల్చి చంపేది... ఎన్ కౌంటర్ పై విమర్శలపై సైనా కౌంటర్

మూడు మ్యాచులో సిరీస్ లో భాగంగా ఆదివారం ట్రివేండ్రంలో జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచులో వెస్టిండీస్ భారత్ కు షాక్ ఇచ్చింది. ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్ ను సమం చేసింది.

దీంతో మూడో టీ20 మ్యాచుపై ఉత్కంఠ నెలకొంది. 9 బంతులు మిగిలి ఉండగానే వెస్టిండీస్ భారత్ తన ముందు ఉంచిన 171 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి ఛేదించింది. 

Also Read:Video: విజయవాడ గ్రౌండ్ లో పాము కలకలం... క్రికెటర్లకు తప్పిన ప్రమాదం

సిమన్స్ 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్ ల సాయంతో 67 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత పూరన్ దూకుడుగా ఆడి 18 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్స్ ల సాయంతో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

Also Read: కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ చూశారా(వీడియో)

భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నారు, విజయంతో వెస్టిండీస్ 1-1 స్కోరుతో సిరీస్ ను సమం చేసింది. దాంతో మూడో మ్యాచుపై ఉత్కంఠ చోటు చేసుకుంది.