విజయవాడ: భారత రంజీ క్రికెటర్లకు తృటిలో అపాయం తప్పింది. ఆటగాళ్లు మ్యాచ్ ఆడుతున్న సమయంలో  మైదానంలోకి పాము ప్రవేశించిన సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. అయితే అది ఆటగాళ్లకు ఎలాంటి హాని తలపెట్టకముందే గుర్తించడంలో పెను ప్రమాదం తప్పింది. 

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్ర, విధర్భ జట్ల మధ్య  గ్రూప్ ఎ క్రికెట్ మ్యాచ్ విజయవాడలో జరుగుతోంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన విదర్భ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఆంధ్రా జట్టు బ్యాటింగ్ కు దిగింది. 

ఇలా విదర్భ ఆటగాళ్లు ఫీల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మైదానంలోకి పాము ప్రత్యక్షమయ్యింది. ఇంచుమించుగా అది మైదానం  మధ్యలోకి వచ్చేవరకు ఎవరూ గమనించలేకపోయారు. చివరకు దీన్ని గమనించిన ఆటగాళ్లు అంపైర్ల  దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన గ్రౌండ్ సిబ్బంది పామును మైదానంనుండి బయటకు పంపించారు. 

read more దిశ వాళ్లను కాల్చి చంపేది... ఎన్ కౌంటర్ పై విమర్శలపై సైనా కౌంటర్

ఈ ఘటనతో కాస్సేపు మ్యాచ్ కు ఆటంకం కలిగింది. పామును చూసి ఆటగాళ్లు భయాందోళనకు లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను బిసిసిఐ డొమెస్టిక్ అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. 

ఇండియా ప్రీమియర్ డొమెస్టిక్ కాంపిటీషన్ లో భాగంగా సోమవారం 86వ మ్యాచ్ ఆంధ్రా వర్సెస్ విధర్భల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో హనుమ విహారీ సారథ్యంలోని ఆంధ్రా జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. హోంగ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరగడం విహారీ సేనకు కలిసొచ్చే అంశం. 

కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ చూశారా(వీడియో)

అయితే ఫయజ్ పజల్ సారథ్యంలోని  విధర్భ జట్టును ఓడించడం అంత ఈజీ కాదు. ఇప్పటికే మూడు రంజీ ట్రోపీలను సాధించిన ఆ జట్టు నాలుగో  ట్రోపీపై గురిపెట్టింది. ఇలా ఇరుజట్ల మధ్య రసవత్తర పోరు సాగుతుండగా మైదానంలో పాము కలకలం సృష్టించింది. 

వీడియో