టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... బ్యాట్ చేతపట్టి... పరుగుల రికార్డులు సృష్టించడంలో దిట్ట అన్న విషయం అందరికీ తెలిసిందే.... కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు... ఫీల్డింగ్ లోనూ తన ప్రతిభను తాజాగా కోహ్లీ నిరూపించాడు. స్టన్నింగ్ క్యాచ్ పట్టి అందరి చేతా శెభాష్ అనిపించుకున్నాడు. 

ఆదివారం జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. అయినప్పటికీ... కోహ్లీని అభిమానులు అభినందిస్తున్నారు. అందుకు కారణం ఆయన పట్టిన క్యాచ్.  జడేజా ఇన్నింగ్స్ 14వ ఓవర్ లో హెట్ మైర్ 2 వరస సిక్సర్లు బాదాడు. ఆ తర్వాతి బంతి కూడా దాదాపు సిక్స్ అని అందరూ భావించారు. కాగా... ఆ భారీ షాట్ ని కోహ్లీ పరుగెత్తుకు వచ్చి క్యాచ్ పట్టాడు.

సెకన్ల వ్యవధిలో బాల్ క్యాచ్ పట్టడంతోపాటు... నియంత్రణ తప్పి బోర్డర్ ని తలగకుండా ఉండేందుకు కోహ్లీ తనను తాను నియంత్రించుకున్న తీరు అద్భుతం. అందుకే..ఈ వీడియో ఇప్పుడు కోహ్లీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. 

 

ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 8 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–1తో నిలిచింది. చివరి మ్యాచ్‌ ఈనెల 11న ముంబైలో జరగనుంది. మరోవైపు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు(2563) చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ(2562) అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. కోహ్లి, రోహిత్‌లు ఉండగా.. మార్టిన్‌ గప్టిల్‌(2463, న్యూజిలాండ్‌), షోయాబ్‌ మాలిక్‌(2263; పాకిస్తాన్‌) తరువాతి స్థానాల్లో ఉన్నారు