గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా, విన్నింగ్ కాంబినేషన్‌ను చెడగొట్టడం ఇష్టం లేక రస్సెల్‌ను ఆడించలేదు... రాహుల్ త్రిపాఠి గాయంతో బాధపడుతున్నా ఆడించాం...

IPL2021 Final చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆండ్రే రస్సెల్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్, స్టార్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉన్నా... అతనికి అవకాశం ఇవ్వలేదు కేకేఆర్... మిడిల్ ఆర్డర్ పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్న సమయంలో రస్సెల్ ఉండి ఉంటే, సీన్ వేరేగా ఉండేదని కామెంట్లు వినిపించాయి...

193 పరుగుల లక్ష్యఛేదనలో మిడిల్ ఆర్డర్ ఘోరంగా ఫెయిల్ అయినా 165 పరుగులు చేయగలిగింది కేకేఆర్. రస్సెల్ వంటి విధ్వంసకర హిట్టర్ ఉండి ఉంటే, విజయానికి అవసరమైన ఆ 27 పరుగుల మార్జిన్ చేరిపేసేవాడని కేకేఆర్ ఫ్యాన్స్ అభిప్రాయం...

కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఏకంగా 11 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరిన మోర్గాన్, ఫైనల్ మ్యాచ్‌లోనూ 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు...
మోర్గాన్ స్థానంలో ఆండ్రే రస్సెల్‌ ఉండి ఉంటే, బౌలింగ్‌లో వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో కనీసం రెండు మూడు సిక్సర్లు కొట్టేవాడని... ఇయాన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు కేకేఆర్ ఫ్యాన్స్...

‘ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలో రస్సెల్ గాయంతో బాధపడుతున్నారు. అతను ఎంతో కష్టపడి, ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు... అయితే అతని గాయం తిరగబెట్టే ప్రమాదం ఉందని మేం భావించాం...

ఫైనల్‌ మ్యాచ్‌లో ఆండ్రే రస్సెల్‌ను ఆడించి రిస్క్ చేయడం ఇష్టం లేక అతన్ని ఆడించలేదు.. విన్నింగ్ కాంబినేషన్ ఫైనల్‌లో కలిసి వస్తుందని ఆశించాం... అలాగే రాహుల్ త్రిపాఠి కూడా గాయంతో బాధపడుతున్నాడు... అయినా అతను మంచి ఫామ్‌లో ఉన్నాడని ఆడించాలని ఫిక్స్ అయ్యాం. ఈ రెండు నిర్ణయాలు కేకేఆర్‌ని నష్టాన్ని కలిగించాయి...’ అంటూ కామెంట్ చేశాడు బ్రెండన్ మెక్‌కల్లమ్...

ఇదీ చదవండి: కోహ్లీ, రోహిత్, బుమ్రాలకు రెస్ట్... ఆవేశ్, గైక్వాడ్ వంటి కుర్రాళ్లకు ఛాన్స్... కివీస్‌తో టీ20 సిరీస్‌కి...

సీఎస్‌కే ఊర మాస్ కమ్‌బ్యాక్... గత సీజన్‌లో ప్లేఆఫ్స్ కూడా చేరకుండా, ఈ సీజన్‌లో టైటిల్ గెలిచి...

 IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా...

IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...