టీ20 ప్రపంచకప్ ఆడే 10 మంది ఆటగాళ్లు ఫైనల్.. రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే.. !

T20 World Cup 2024: అఫ్గానిస్థాన్ తో జ‌రిగిన టీ20 సిరీస్ ను గెలుచుకున్న త‌ర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వెస్టిండీస్, అమెరికా గడ్డపై జరగనున్న మెగా టోర్న‌మెంట్ ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు. టీ20 ప్ర‌పంచ క‌ప్ కోసం భార‌త జ‌ట్టులో ఉండ‌నున్న ప్లేయ‌ర్ల గురించి చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.
 

These are the 10 players of Team India who will play T20 World Cup 2024; Rohit Sharma's comments are viral RMA

World Cup-Team India:టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024కు సంబంధించిన‌ ఏర్పాట్లను ఐసీసీ సిద్ధం చేస్తోంది. ఈ సారి వెస్టిండీస్, యూఎస్ఏ వేదిక‌గా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 జ‌ర‌గ‌నుంది. 2023 వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ చేజారినా.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 ను మాత్రం ఎట్టిప‌రిస్థితుల్లో కోల్పోకూడ‌ద‌ని భార‌త్ ప్రాణాళిక‌లు సిద్ధం చేస్తోంది. అయితే, వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌బోయే టీమిండియాలో ఏ ప్లేయ‌ర్స్ ఉంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ క్ర‌మంలోనే భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ సిరీస్ ముగిసిన త‌ర్వాత భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆ ఐసీసీ మెగా టోర్నమెంట్ కు ఎంపికయ్యే 15 మంది ఆటగాళ్ల గురించి ఒక‌ హింట్ ఇచ్చాడు. అందులో 8 నుంచి 10 మంది ఆటగాళ్ల పేర్లు ఇప్పటికే త‌న మ‌దిలో ఉన్నాయ‌ని పేర్కొన్నాడు.

20 వ‌ర‌ల్డ్ క‌ప్-2024 కోసం రోహిత్ తన సొంత ఆటగాళ్లను ఎంచుకున్నాడా?

2024 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జూన్ 1 నుంచి 29 వరకు వెస్టిండీస్, యూఎస్ఏ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఈసారి ఐసీసీ మెగా టోర్నీలో సత్తా చాటేందుకు 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ టీమ్ ల‌లో టైటిల్ గెలిచేందుకు భారత్ గట్టి పోటీదారుగా ఉంది. ఏదైనా టోర్నమెంట్ లో పాల్గొనే ముందు జట్టు ఎంపికతోనే తొలి సన్నాహాలు మొదలవుతాయి. రోహిత్ శర్మ సొంత ఆటగాళ్లను ఎంచుకున్నాడా? అంటే  బెంగళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఆప్ఘనిస్థాన్ ను ఓడించిన అనంతరం భారత కెప్టెన్ రోహిత్ చేసిన ప్ర‌క‌ట‌న అవున‌నే స‌మాధాన‌మిచ్చింది.

సూపర్ ఓవర్ అంటే ఏమిటి? భారత్-ఆఫ్ఘ‌నిస్తాన్ మ్యాచ్ లో రెండో సూపర్ ఓవర్ కూడా టై అయివుంటే..?

రోహిత్ మదిలో 8-10 మంది ఆటగాళ్ల

గ‌తేడాది ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2022కి ఒక అడుగు దూరంలో ఆగిన భార‌త్.. రానున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను గెల‌వ‌డం ల‌క్ష్యంగ పెట్టుకుంది. మళ్లీ ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ గెలిచేందుకు ప్రయత్నిస్తానని కూడా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ గతంలో చెప్పాడు. అయితే, ఇది చెప్పినంత తేలిక కాద‌నీ, ఇందుకోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాడు రోహిత్. 2024 ఐసీసీ టీ20 వరల్డ్ క‌ప్ కు కోసం 15 మంది ఆటగాళ్లను ఇంకా ఖరారు చేయలేదని తెలిపిన రోహిత్ శ‌ర్మ‌.. త‌న దృష్టిలో 8 నుంచి 10 మంది ఆటగాళ్ల ఉన్నార‌ని తెలిపారు. విండీస్ లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేస్తార‌న్నాడు.

టీ20 క్రికెట్ లో ఐదు సెంచ‌రీలు కొట్టిన తొలి ప్లేయ‌ర్ గా రోహిత్ శ‌ర్మ రికార్డు..

జట్టు కూర్పుకు సంబంధించి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటానని చెప్పిన‌ రోహిత్ శర్మ.. విండీస్ లో పరిస్థితి కాస్త నెమ్మదించిందనీ, దాన్ని దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేస్తామని తెలిపాడు. భారత కెప్టెన్ మాటలను బట్టి రెండు మూడు విషయాల్లో క్లారిటీ ల‌భించింది. తొలుత దాదాపు 10 మంది ఆటగాళ్ల పేర్లు అతని మదిలో మెదిలాయి. దీంతో మిగిలిన ఐదు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. రెండోది విండీస్ లో పరిస్థితులను బట్టి ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. అదే సమయంలో అతని ప్రస్తుత, వెస్టిండీస్ రికార్డులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అంటే ఇదివ‌ర‌కు వెస్టిండీస్ లో ఆడిన అనుభ‌వం, అక్క‌డ రాణించిన స్టార్లు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2024 కోసం భార‌త టీమ్ లోకి తీసుకోనున్నారు.

షోయబ్ మాలిక్ తో డివోర్స్ కన్ఫార్మ్.. ! పెళ్లి, విడాకుల పై సానియా మీర్జా పోస్ట్ వైర‌ల్ !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios