Dinesh Karthik : 20 ఏళ్ల క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా స్టార్ ప్లేయ‌ర్

Dinesh Karthik retires: భార‌త వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తన బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని చెప్పి షాకిచ్చాడు. కార్తీక్ ఎమోషనల్ పోస్ట్ ద్వారా త‌న రిటైర్మెంట్ గురించి పేర్కొన్నాడు.
 

Team India star player Dinesh Karthik announced his retirement on his birthday RMA

Dinesh Karthik Retirement : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ తన పుట్టినరోజు సందర్భంగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించి అంద‌రికీ షాకిచ్చాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లకు శనివారం అధికారికంగా వీడ్కోలుకుతున్న‌ట్టు డీకే ప్ర‌క‌టించాడు. ఈ విషయాన్ని ఆయన తన 39వ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. కొత్త ఛాలెంజ్‌లకు సిద్ధమని కార్తీక్ భావోద్వేగంతో త‌న రిటైర్మెంట్ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలిపాడు. టీమిండియా త‌ర‌ఫున జ‌ట్టుకు ఎన్నో విజ‌యాల్లో త‌న‌దైన పాత్ర పోషించి మంచి గుర్తింపు సాధించాడు. ఐపీఎల్ లోనూ ఈ స్టార్ ప్లేయ‌ర్ త‌న స‌త్తా ఎంటో నిరూపించుకున్నాడు.

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన దినేష్ కార్తీక్.. భారత్ తరఫున 180 మ్యాచ్‌లు ఆడి 3463 పరుగులు చేశాడు. త‌న కెరీర్ లో ఒక సెంచరీ, 17 అర్ధ సెంచరీలు సాధించాడు. వికెట్ కీపర్‌గా 172 మంది ఆటగాళ్లను అవుట్ చేశాడు. డీకే చివరిసారిగా 2022లో టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఆడాడు.

T20 WORLD CUP 2024 కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి శివమ్ దూబేకు బౌలింగ్ చిట్కాలు.. వీడియో

దినేష్ కార్తీక్ చివరిసారిగా ఐపీఎల్ 2024లో ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన డీకే సూప‌ర్ ఇన్నింగ్స్ ల‌తో అద‌ర‌గొట్టాడు. ఐపీఎల్ 2024 లో ఆర్సీబీ ప్ర‌యాణం ఎలిమినేటర్‌లో ముగిసిన త‌ర్వాత.. దినేష్ కార్తీక్ రిటైర్ కావడం ఖాయం అనే వార్తల మ‌ధ్య త‌న పుట్టినరోజున దానిని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.  ఎక్స్ లో చేసిన పోస్టులో "చాలా పరిశీలనల‌ తర్వాత, నేను పోటీ క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. నేను నా రిటైర్‌మెంట్‌ను అధికారికంగా ప్రకటిస్తున్నాను. రాబోయే కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉన్నాని" పేర్కొన్నాడు.

అలాగే, "నా సుదీర్ఘ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా, మ‌రింత ఆనందంగా మార్చిన నా కోచ్‌లు, కెప్టెన్‌లు, సెలెక్టర్లు, సహాయక సిబ్బందికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. నా తల్లిదండ్రులు నాకు మ‌రింత బలాన్ని, మద్దతును అందించాడు. వారి ఆశీర్వాదం లేకుండా నేను ఈ రోజు ఉండేవాడిని కాదు. నా ప్రయాణంలో నతో క‌లిసి ముందుకు న‌డిచిన దీపికా (భార్య)కి కూడా నేను చాలా కృతజ్ఞుడను" అని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు. ఐపీఎల్ లో డీకే 22 అర్ధ సెంచరీలు సాధించాడు. ఆర్సీబీ, ముండైల‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి ఫ్రాంచైజీలకు ఆడాడు. 

T20 World Cup 2024: అమెరికాలో సూప‌ర్ గా ఉన్నాయి మామా.. రోహిత్ శ‌ర్మ

 

 

TIMES NOW - ETG EXIT POLL : ఏన్డీయేకు ప‌ట్టం.. కాంగ్రెస్ ప్ర‌తిప‌క్ష పాత్ర‌కే పరిమితం.. ! 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios