MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • 30 బంతుల్లో ఊహకందని ఊచకోత.. కట్ చేస్తే.. కాటేరమ్మ కొడుకు ఖాతాలో చెత్త రికార్డు

30 బంతుల్లో ఊహకందని ఊచకోత.. కట్ చేస్తే.. కాటేరమ్మ కొడుకు ఖాతాలో చెత్త రికార్డు

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తిరిగి ఫాంలోకి రావడమే కాకుండా అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. కానీ ఓ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.  

2 Min read
Author : Pavithra D
Published : Feb 27 2026, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అభిషేక్ చెత్త రికార్డు..
Image Credit : Getty

అభిషేక్ చెత్త రికార్డు..

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాట్‌కు పని చెప్పాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించలేక ఒత్తిడిలో ఉన్న అభిషేక్.. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో జింబాబ్వే బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన అభిషేక్.. ప్రపంచకప్ కెరీర్‌లో తన మొదటి అర్ధశతకాన్ని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మెరుపు ఇన్నింగ్స్..
Image Credit : ANI

మెరుపు ఇన్నింగ్స్..

చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే 55 పరుగులు సాధించాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. 183.33 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన అభిషేక్.. తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 9వ అర్ధశతకాన్ని అందుకున్నాడు. అలాగే ప్రపంచకప్ కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు.

35
నెలకొల్పిన రికార్డులు
Image Credit : ANI

నెలకొల్పిన రికార్డులు

ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ పలు కీలక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అభిషేక్ శర్మ 50 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే మొదటిసారి. అలాగే జింబాబ్వేపై రెండో అత్యంత స్లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. 2024లో 33 బంతుల్లో 50 చేయగా.. ఇప్పుడు 26 బంతుల్లో అర్ధ సెంచరీ కొట్టాడు.

45
అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం
Image Credit : X/SunRisers

అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం

సంజూ శాంసన్‌తో కలిసి ఓపెనింగ్ వికెట్‌కు 48 పరుగులు జోడించాడు అభిషేక్ శర్మ. ఇది 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు అత్యుత్తమ ఓపెనింగ్ పార్టనర్‌షిప్. రెండో వికెట్‌కు ఇషాన్ కిషన్‌తో కలిసి 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇందులో ఇషాన్ 38 పరుగులు చేయగా, అభిషేక్ 33 పరుగుల సహకారం అందించాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మరో 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

55
నాకౌట్ మ్యాచ్ ముందు..
Image Credit : Twitter

నాకౌట్ మ్యాచ్ ముందు..

అభిషేక్ శర్మ తిరిగి ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు మంచి పరిణామం కాగా.. ముఖ్యంగా మార్చి 1న వెస్టిండీస్‌తో జరగనున్న కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఓపెనర్ ఇలాంటి ప్రదర్శన చేయడం టీమిండియాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ ఈ టోర్నీలోనే అత్యధిక స్కోరును నమోదు చేయగలిగింది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image2
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Recommended image3
శ్రేయాస్ అయ్యర్ విధ్వంసక సెంచరీ.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Related Stories
Recommended image1
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Recommended image2
Cricket Records : క్రికెట్ చరిత్రలో అద్భుతం.. ఒక్కసారి కూడా రనౌట్ కాని ఐదుగురు క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved