T20 World Cup 2024 : రోహిత్ శర్మ సార‌థ్యంలోని టీమిండియా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 కోసం అమెరికాకు చేరుకుంది. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.  

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 కోసం అమెరికా వెళ్లిన భార‌త జ‌ట్టు అక్క‌డ ముమ్మ‌రంగా ప్రాక్టిస్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే మెగా టోర్నీకి ముందు జూన్ 1న బంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడ‌నుంది. అయితే, ప్రాక్టీస్ సంద‌ర్భంగా భారత ఆల్ రౌండర్ శివమ్ దూబే, కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి బౌలింగ్ చిట్కాలు నేర్చుకుంటున్నాడు. ఐపీఎల్ 2024లో దూబే కేవలం ఆరు బంతులు మాత్రమే వేసి ఉండవచ్చు, కానీ రాబోయే టీ20 ప్రపంచ కప్‌లో ఆల్ రౌండర్ శివమ్ దూబే సీమ్-అప్ ప్రతిభను మరింత ఎక్కువ‌గా ఉపయోగించాలని రోహిత్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించి ప్రాక్టీస్ వీడియో దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.

దుబే ఇటీవల ఎక్కువ బౌలింగ్ చేయనప్పటికీ, అత‌ను నిస్సందేహంగా ఏ ఫ్రాంఛైజీ కోసం ఆడినా విలువైన బౌలర్. అతను ఇటీవల అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌గా కూడా మారాడు. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఆల్ రౌండర్ 2024లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బౌలింగ్ చేయడానికి చాలా అవకాశాలు పొందలేకపోయాడు. న్యూ యార్క్‌లో జూన్ 1న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 వార్మప్ మ్యాచ్ కోసం సన్నాహకంగా భారత జట్టు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసింది. న్యూయార్క్‌లోని ఇటీవలే నిర్మించిన నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జూన్ 5న టీ20 ప్రపంచకప్ 2024 లో భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో త‌ల‌ప‌డ‌నుంది.

T20 World Cup 2024 లో భారత్-బంగ్లాదేశ్ ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఉచితంగా ఎక్క‌డ చూడాలి?

ఆ త‌ర్వాత జూన్ 9న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. జూన్ 12న టోర్నమెంట్ సహ-హోస్ట్ అయిన అమెరికాతో, జూన్ 15న కెనడాతో త‌ల‌ప‌డ‌నుంది. 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా, భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే ప్రాక్టీస్ సెషన్‌లలో చాలా శ్రమిస్తున్నాడు. నెట్స్‌లో శివమ్ దూబే కెప్టెన్ రోహిత్ శర్మకు బౌలింగ్ చేశాడు. అతను అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ, బౌలింగ్ చేయడానికి తగిన లెంగ్త్‌ల గురించి హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ ఆల్‌రౌండర్‌కు కొన్ని సలహాలు ఇచ్చాడు. క్రికెట్ లో చ‌రిత్రలో అత్యంత ప్రమాదకరమైన టీ20 హిట్టర్‌లలో ఒకరైన రోహిత్ శ‌ర్మ స‌ల‌హాల‌ను దూబే జాగ్ర‌త్త‌గా వింటూ క‌నిపించాడు.

Scroll to load tweet…
Scroll to load tweet…

టీ20 వరల్డ్ క‌ప్ 2024 లో భార‌త్ ట్రంప్ కార్డు అత‌నే.. ఈ ఇద్దరు ప్లేయర్లు తుది జట్టులో ఉండాల్సిదే