గంభీర్-జ‌య‌సూర్యల బిగ్ ఫైట్.. భార‌త్-శ్రీలంక‌ సిరీస్‌లో ఎవ‌రిది పైచేయి కానుంది?

Team India's tour of Sri Lanka : మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత్ జూలై నుంచి ఆగస్టు వరకు శ్రీలంకలో పర్యటించ‌నుంది. గౌత‌మ్ గంభీర్ హెడ్ కోచ్ గా టీమిండియాకు ఇది తొలి సిరీస్. 
 

Team India's tour of Sri Lanka : Gautam Gambhir-Sanath Jayasuriya's big fight.. Who will have the upper hand? RMA

Team India's tour of Sri Lanka : టిమిండియా రాబోయే రోజుల్లో బిజీ షెడ్యూల్ తో గ‌డ‌ప‌నుంది. టీ20 ప్ర‌పంచ క‌ప్ 2020 టైటిల్ ను సాధించిన త‌ర్వాత వెంట‌నే జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ ఇంకా కొన‌సాగుతోంది. ఇది ముగిసిన వెంట‌నే మ‌రో సిరీస్ కోసం విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది భార‌త జ‌ట్టు. దీనికి సంబంధించి భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది.

జూలై-ఆగస్టు మ‌ధ్యలో భార‌త జ‌ట్టు శ్రీలంక పర్యటనకు వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మూడు టీ20 ఇంటర్నేషనల్స్, మూడు వ‌న్డే మ్యాచ్ ల సిరీస్ ల‌ను ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లు పల్లెకెలె, కొలంబోలో జరుగుతాయని బీసీసీఐ ప్ర‌క‌టించింది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జూలై 26, 27, 29 తేదీలలో టీ20 మ్యాచ్ ల‌తో ఈ వైట్-బాల్ పర్యటన ప్రారంభమవుతుంది. దీని త‌ర్వాత వ‌న్డే సిరీస్ కోసం ఇరు జ‌ట్లు కొలంబోకు చేరుకుంటాయి. కోలంబో లోని ఆర్ ప్రేమదాస అంతర్జాతీయ స్టేడియంలో  మూడు వ‌న్డేల‌ను ఆగష్టు 1, 4, 7 తేదీలలో ఇరు జ‌ట్లు ఆడ‌నున్నాయి.

కొత్త కోచ్ లు.. ఫుల్ జోష్ లో.. 

కొత్తగా నియమితులైన టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కి ఇది మొదటి అసైన్‌మెంట్. అలాగే, లెజెండ‌రీ క్రికెట‌ర్, అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌కు మారుపేరుగా నిలిచిన‌ సనత్ జయసూర్య శ్రీలంక టీమ్ కు కొత్త హెడ్ కోచ్ గా నియ‌మితుల‌య్యారు. భారత్‌కు రెండో టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను అందించిన రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో గంభీర్‌ వచ్చాడు. క్రిస్ సిల్వర్‌వుడ్ స్థానంలో జయసూర్య బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఈ సిరీస్ పై క్రికెట్ వ‌ర్గాల్లో ఆస‌క్తి నెలకొంది. కాగా, ఈ ప‌ర్య‌ట‌న కోసం భారత్ ఇంకా జట్టును ప్రకటించలేదు. అయితే, ఈ సిరీస్ కు విరాట్ కోమ్లీ, రోహిత్ శ‌ర్మ‌, జ‌స్ప్రీత్ బుమ్రాల‌కు విశ్రాంతి ఇవ్వ‌నున్న‌ట్టు ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

కెప్టెన్లుగా హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ 

కేఎల్ రాహుల్ మ‌ళ్లీ కెప్టెన్ గా జ‌ట్టులోకి రాబోతున్నాడ‌ని స‌మాచారం. హార్దిక్ పాండ్యా టీ20 భార‌త జట్టుకు నాయకత్వం వ‌హించ‌నుండ‌గా, కేఎల్ రాహుల్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉంటార‌ని క్రికెట్ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. ఇదిలావుండగా, టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశల్లో నిష్క్రమించిన శ్రీలంక జ‌ట్టు కెప్టెన్సీకి వనిందు హసరంగ గుడ్ బై చెప్పాడు. దీంతో అత‌ని స్థానంలో కొత్త సారథి రానున్నాడు. ద్రవిడ్ స్టాండ్-ఇన్ కోచ్‌గా ఉన్న స‌మ‌యంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భార‌త్ ఇంత‌కుముందు శ్రీలంక‌లో ప‌ర్య‌టించింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో టీ20 సీరిస్ ల‌తో పాటు వ‌న్డే సిరీస్ ను ఆడింది. 2021లో జ‌రిగిన ఈ ప‌ర్య‌ట‌న‌లో శిఖ‌ర్ ధావ‌న్ కెప్టెన్సీలో టీమిండియా విజయంతో స్వ‌దేశానికి తిరిగివ‌చ్చింది.

HARDIK PANDYA: హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయేనా..?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios