Team India's schedule for home season: సెప్టెంబర్ లో భారత్ సొంతగడ్డపై రెండు డబ్ల్యూటీసీ టెస్టులు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో తొలి టెస్టు, సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లో రెండో టెస్టు ఆడ‌నుంది. అలాగే, ధర్మశాల, ఢిల్లీ, హైదరాబాద్ వేదికగా మూడు టీ20 మ్యాచ్ ల‌ను కూడా ఆడ‌నుంది. 

Team India's schedule for home season: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 ముగిసిన వెంట‌నే భార‌త్ లో మ‌రో క్రికెట్ జాత‌ర మొద‌లుకానుంది. స్వ‌దేశంలో మూడు దేశాల జ‌ట్ల‌తో వ‌రుస‌గా సిరీస్ ల‌ను భార‌త్ ఆడ‌నుంది. క్రికెట్ ల‌వ‌ర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీమిండియా అంతర్జాతీయ హోమ్ సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఈ సీజన్ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఉంటుంది. సెప్టెంబరు 19న ప్రారంభమయ్యే తొలి టెస్టుకు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుండగా, సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో రెండో టెస్టు జరగనుంది. టీ20 మ్యాచ్‌లు ధర్మశాల (అక్టోబర్ 6), ఢిల్లీ (అక్టోబర్ 9), హైదరాబాద్ (అక్టోబర్ 12)లో జరుగుతాయి.

ఈ సిరీస్ ముగిసిన వెంట‌నే న్యూజిలాండ్‌తో భార‌త జ‌ట్టు మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడ‌నుంది. మొదటి టెస్టు అక్టోబర్ 16న బెంగళూరులో ప్రారంభమవుతుంది. రెండు, మూడు టెస్టులు వరుసగా పూణె, ముంబైలలో జరగనున్నాయి. న్యూ ఇయర్ ప్రారంభం కాగానే, ఉత్కంఠభరితమైన వైట్-బాల్ పోటీ జరుగనుంది. ఇంగ్లాండ్ జ‌ట్టు 5 టీ20 మ్యాచ్ లు, 3 వ‌న్డే మ్యాచ్ లు ఆడ‌టం కోసం భార‌త్ లో పర్యటించనుంది. జనవరి 22న చెన్నైలో ఓపెనింగ్ టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. జనవరి 25న రెండో టీ20 కోల్ క‌తాలో, 28న రాజ్‌కోట్‌లో మూడో మ్యాచ్ ఆడనుంది. జనవరి 31న పూణే నాలుగో టీ20కి ఆతిథ్యం ఇవ్వగా, ఫిబ్రవరి 2న ముంబైలో జరిగే ఐదవ, ఈ సిరీస్ లో చివరి మ్యాచ్‌తో సిరీస్ ముగుస్తుంది.

టాప్-10 రిచెస్ట్ క్రికెట‌ర్లు వీరే.. భార‌త్ నుంచి ఎంత‌మంది ఉన్నారంటే?

అలాగే, వ‌న్డే సిరీస్ ఫిబ్రవరి 6 న నాగ్‌పూర్‌లో ప్రారంభమవుతుంది. రెండో వ‌న్డే మ్యాచ్ ను ఫిబ్రవరి 9 న కటక్‌లో, మూడో వ‌న్డేను ఫిబ్రవరి 12 న అహ్మదాబాద్‌లో ఆడ‌నుంది. 

టీమిండియా 2024-25 హోం షెడ్యూల్ ఇదే.. 

భార‌త్ vs బంగ్లాదేశ్

1వ టెస్టు: చెన్నై (సెప్టెంబర్ 19-23)
2వ టెస్టు: కాన్పూర్ (సెప్టెంబర్ 27-అక్టోబర్ 1)
1వ టీ20: ధర్మశాల (అక్టోబర్ 6)
2వ టీ20: ఢిల్లీ (అక్టోబర్ 9)
3వ టీ20: హైదరాబాద్ (అక్టోబర్ 12)

భార‌త్ vs న్యూజిలాండ్

1వ టెస్టు: బెంగళూరు (అక్టోబర్ 16-20)
2వ టెస్టు: పూణె (అక్టోబర్ 24-28)
3వ టెస్టు: ముంబై (నవంబర్ 1-5)

భార‌త్ vs ఇంగ్లండ్

1వ టీ20: చెన్నై (జనవరి 22)
2వ టీ20: కోల్‌కతా (జనవరి 25)
3వ టీ20: రాజ్‌కోట్ (జనవరి 28)
4వ టీ20: పూణె (జనవరి 31)
5వ టీ20: ముంబై (ఫిబ్రవరి 2)
1వ వన్డే: నాగ్‌పూర్ (ఫిబ్రవరి 6)
2వ వన్డే: కటక్ (ఫిబ్రవరి 9)
3వ వన్డే: అహ్మదాబాద్ (ఫిబ్రవరి 12)

గేమ్ ఛేంజర్.. చాలా సంతోషంగా ఉందంటున్న టీమిండియా స్టార్ క్రికెటర్