టాప్-10 రిచెస్ట్ క్రికెటర్లు వీరే.. భారత్ నుంచి ఎంతమంది ఉన్నారంటే?
Top 10 richest cricketers : క్రికెట్ భారతీయ హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. కేవలం భారత్ లోనే కాకుండా చాలా దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందింది. కేవలం అందరికీ ఇష్టమైన క్రీడ మాత్రమే కాదు.. అత్యంత లాభదాయకమైనది కూడా. క్రికెట్ నిర్వాహకులు, ఆటగాళ్లు భారీగానే సంపాదిస్తున్నారు.

Sachin Tendulkar, MS Dhoni, virat kohli
Top 10 richest cricketers in the world in 2024 : ఐసీసీ మెగా టోర్నమెంట్ లు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఆకర్షిస్తాయి. టిక్కెట్ విక్రయాలు, స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనల ద్వారా నిర్వాహకులకు భారీ ఆదాయాన్ని అందిస్తాయి. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నమైన స్పోర్ట్స్ లీగ్‌లలో ఒకటిగా ఉంది, ఇది క్రికెట్ పట్ల భారతదేశ అభిరుచి ప్రదర్శిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ లీగ్ నుంచి చాలా మంది క్రికెటర్లు భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు కూడా. ఇక ప్రస్తుతం క్రికెట్ లో టాప్-10 ధనవంతులైన క్రికెటర్లను గమనిస్తే..
1.సచిన్ టెండూల్కర్
నికర విలువ: $170 మిలియన్లు
జట్టు: టీమిండియా
వయస్సు: 51
క్రికెట్ గాడ్ గా గుర్తింపు పొంది. సచిన్ టెండూల్కర్ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్. క్రికెట్ ప్రపంచంలో ఒక లెజెండ్. 100 అంతర్జాతీయ సెంచరీలతో సహా అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.
2.మహేంద్ర సింగ్ ధోని
నికర విలువ: $111 మిలియన్లు
జట్టు: టీమిండియా
వయస్సు: 42
కెప్టెన్ కూల్ అని ముద్దుగా పిలుచుకునే మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. అతని నాయకత్వంలో భారత జట్టు 2007 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20, 2011 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌తో సహా అనేక విజయాలుఅ అందుకుంది.
10. యువరాజ్ సింగ్
నికర విలువ: $35 మిలియన్లు
జట్టు: భారతదేశం
వయస్సు: 42
యువరాజ్ సింగ్.. యువీ అని ముద్దుగా పిలుచుకునే స్టార్ ఆల్ రౌండర్.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతాలు చేశాడు. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ లు ఆడాడు. 2007, 2011 ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ లో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు.
Virat Kohli
3.విరాట్ కోహ్లీ
నికర విలువ: $92 మిలియన్లు
జట్టు: టీమిండియా
వయస్సు: 35
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. రన్ మిషన్ గా గుర్తింపు పొందిన ఈ స్టార్ ప్లేయర్ అసాధారణమైన బ్యాటింగ్, దూకుడు నాయకత్వ శైలితో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అన్ని ఫార్మాట్ లలో తనదైన ముద్రవేసి ప్రపంచంలోని టాప్-10 సంపన్న క్రికెటర్లలో ఒకడిగా ఉన్నారు.
Ricky Ponting
4. రికీ పాంటింగ్
నికర విలువ: $70 మిలియన్లు
జట్టు: ఆస్ట్రేలియా
వయస్సు: 49
రికీ పాంటింగ్ ఒక మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్. పాంటింగ్ గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా గుర్తింపు సాధించాడు. 2003, 2007లో వరుసగా రెండు ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ విజయాలకు ఆస్ట్రేలియా జట్టును నడిపించడం పాంటింగ్ గొప్ప కెరీర్‌లో ఉంది.
Brian Lara
5. బ్రియాన్ లారా
నికర విలువ: $60 మిలియన్లు
జట్టు: వెస్టిండీస్
వయస్సు: 55
ప్రిన్స్ ఆఫ్ ట్రినిడాడ్ అని ముద్దుగా పిలుచుకునే బ్రియాన్ లారా.. సొగసైన బ్యాటింగ్ శైలి-రికార్డ్-బ్రేకింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ లెజెండరీ క్రికెటర్ టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ తో పాటు అనేక బ్యాటింగ్ రికార్డులు సాధించాడు.
6. షేన్ వార్న్
నికర విలువ: $50 మిలియన్లు
జట్టు: ఆస్ట్రేలియా
వయస్సు: 52
షేన్ వార్న్ క్రికెట్ చరిత్రలో గొప్ప స్పిన్ బౌలర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. లెగ్-స్పిన్ డెలివరీలతో అదరగొట్టాడు. సెప్టెంబర్ 13, 1969 న జన్మించిన వార్న్.. మార్చి 4, 2022 న థాయ్‌లాండ్‌లో మరణించాడు. థాయ్‌లాండ్‌లో విహారయాత్రకు వెళ్లిన ఆయనకు గుండెపోటు ప్రాణాలు కోల్పోయారు.
<h1 data-short-title="Kallis appointed as England batting consultant" itemprop="headline">Jacques Kallis</h1>
7. జాక్వెస్ కల్లిస్
నికర విలువ: $48 మిలియన్లు
జట్టు: దక్షిణాఫ్రికా
వయస్సు: 48
జాక్వెస్ కల్లిస్ తన అసాధారణమైన ఆల్ రౌండ్ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన మాజీ దక్షిణాఫ్రికా క్రికెటర్. కల్లిస్ బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ లతో జట్టుకు అనేక విజయాలు అందించిన గొప్ప ప్లేయర్.
8. వీరేంద్ర సెహ్వాగ్
నికర విలువ: $40 మిలియన్లు
జట్టు: భారతదేశం
వయస్సు: 45
వీరేంద్ర సెహ్వాగ్.. టీమిండియా డాషింగ్ ఓపెనర్. దూకుడు బ్యాటింగ్ శైలి.. నిర్భయమైన ఆటతో గుర్తింపు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాటింగ్‌లో సరికొత్త వరవడిని తీసుకువచ్చాడు. ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడాడు.
9. షేన్ వాట్సన్
నికర విలువ: $40 మిలియన్లు
జట్టు: ఆస్ట్రేలియా
వయస్సు: 42
షేన్ వాట్సన్ అద్భుతమై బ్యాటింగ్, సీమ్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందిన మాజీ ఆస్ట్రేలియన్ ఆల్-రౌండర్.
Yuvraj Singh
10. యువరాజ్ సింగ్
నికర విలువ: $35 మిలియన్లు
జట్టు: భారతదేశం
వయస్సు: 42
యువరాజ్ సింగ్.. యువీ అని ముద్దుగా పిలుచుకునే స్టార్ ఆల్ రౌండర్.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతాలు చేశాడు. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ లు ఆడాడు. 2007, 2011 ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ లో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు.