లాక్‌డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడలు నిలిచిపోగా... క్రికెట్‌పైనా ప్రభావం పడింది. ఈ క్రమంలో కరోనా వైరస్ టీమిండియా టెస్ట్ ర్యాంకింగ్‌పై పడింది. సుదీర్గ ఫార్మాట్‌‌లో తన అగ్రస్థానాన్ని ఆస్ట్రేలియాకు కోల్పోయింది.

మ్యాచ్‌లేమీ లేకపోయినా నిబంధనల ప్రకారం తాజా ర్యాంకుల్లో మూడో స్థానానికి చేరుకోగా, కివీస్ జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఈ మూడు జట్ల మధ్య అంతరం కేవలం ఒక పాయింటే.

Also Read:సైమండ్స్ కి బ్రెట్ లీ గుండు గీస్తే....!

ఆస్ట్రేలియా (116 రేటింగ్), న్యూజిలాండ్ (115), భారత్ (114)తో నిలిచాయి. 2016 జనవరిలో ఇలాగే భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ఇలా ఒక పాయింటే అంతరం ఉండేది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం కావడానికి ముందునుంచే కోహ్లీ సేన 2016 అక్టోబర్ నుంచి టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

కాగా 2016-17లో సాధించిన 12 టెస్టు విజయాలు, ఒక ఓటమిని ఐసీసీ పరిగణనలోనికి తీసుకోకపోవడంతో భారత ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపింది. ఆ సమయంలో టీమిండియా ఐదు సిరీస్‌లను కైవసం చేసుకుంది.

Also Read:ఉమర్ అక్మల్ మూర్చ రోగి... పీసీబీ మాజీ ఛైర్మన్

ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పైనా విజయాలున్నాయి. ఆ సమయంలోనూ దక్షిణాఫ్రికా, టీమిండియా చేతిలో ఆసీస్ ఓటమి పాలైంది. శుక్రవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ కోసం 2019 మే నుంచి ఆడిన మ్యాచుల 100 శాతం, అంతకు ముందు రెండేళ్ల మ్యాచ్‌ల 50 శాతం రేటింగ్ పాయింట్లను ఐసీసీ ఆధారంగా తీసుకున్నారు.

ఆస్ట్రేలియా టెస్టుల్లోనే కాకుండా తొలిసారి టీ20ల్లో ప్రపంచ నెంబర్‌వన్‌గా మారింది. భారత్ మూడో స్థానంలో ఉంది. వన్డేల్లో ఇంగ్లాండ్ తొలి స్థానంలో ఉండగా, భారత్ రెండో ర్యాంకులో కొనసాగుతోంది.