Asianet News TeluguAsianet News Telugu

సైమండ్స్ కి బ్రెట్ లీ గుండు గీస్తే....!

కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ వేళ ఐసీసీకి పెద్దగా పనిలేకుండా పోయింది. సాధారణంగా అన్ని దేశాల మధ్య మ్యాచుల షెడ్యూల్ ని చూసుకుంటూ... ఈ పాటికి ప్రపంచ కప్ కోసం సన్నాహాలు మొదలు పెట్టేది. కానీ లాక్ డౌన్ పుణ్యమాని.... ఖాళీగా ఉండిపోయింది. 

ICC shares hilarious picture of brett lee tonsuring Andrew Symonds
Author
Hyderabad, First Published May 1, 2020, 3:49 PM IST

కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ వేళ ఐసీసీకి పెద్దగా పనిలేకుండా పోయింది. సాధారణంగా అన్ని దేశాల మధ్య మ్యాచుల షెడ్యూల్ ని చూసుకుంటూ... ఈ పాటికి ప్రపంచ కప్ కోసం సన్నాహాలు మొదలు పెట్టేది. కానీ లాక్ డౌన్ పుణ్యమాని.... ఖాళీగా ఉండిపోయింది. 

ఇక ఈ ఖాళీ సమయంలో ప్రజలెవ్వర్నీ ఇండ్లలోంచి బయటకు రాకుండా ఉండమని కోరుతూ, వారిని ఆహ్లాద పరిచేందుకు యాక్టివిటీలను చేస్తూ బిజీగా తనని తాను ఉంచుకునే ప్రయత్నం చేస్తుంది. 

పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అభిమానులకు వినోదాన్ని పంచుతూ... వారిని కూడా తమ యాక్టివిటీల్లో భాగస్వాములను చేస్తుంది. తాజాగా  ఐసీసీ తమ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన ఒక పాత ఫోటో ఇలాంటిదే ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తుకు చేసింది. 

ఆసీస్‌ మాజీ క్రికెటర్లు ఆండ్రూ సైమండ్స్‌-బ్రెట్‌ లీ ఫొటోను షేర్‌ చేసింది. ఆండ్రూ సైమండ్స్‌కు బ్రెట్‌ లీ నున్నగా గుండు గీస్తున్న ఫోటోను పోస్ట్‌ చేనింది. ‘హెయిర్‌ అప్రిసియేషన్‌ డే’ సందర్భంగా ఈ ఫోటోను ఐసీసీ సోషల్‌ మీడియా లో అభిమానులతో పంచుకుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy #HairstyleAppreciationDay 💇‍♀️ Who is styling your hair during isolation?

A post shared by ICC (@icc) on Apr 30, 2020 at 12:45am PDT

మైదానంలో ఎప్పుడూ  విన్నూత్నంగా కనబడే  సైమండ్స్‌ రకరకాల హెయిర్‌ స్టైల్స్‌తో అలరించేవాడు. ఈ క్రమంలోనే  సైమండ్స్‌ తలపై ట్రిమ్మర్‌తో బ్రెట్‌ లీ గుండు గీసిన ఒకనాటి జ్ఞాపకాన్ని మళ్లీ గుర్తు చేసింది ఐసీసీ. 

ఇప్పుడు ఎలాగూ లాక్ డౌన్ నడుస్తూయింది కాబట్టి ఎవరు కూడా బయటకు వెళ్లి కటింగ్ మాత్రం చేయించుకోలేరు. ఈ నేపథ్యంలో ఇసోలాటిన్ సందర్భంగా మీ జుట్టును ఎవరు స్టైల్ చేస్తున్నారు అంటూ ఐసీసీ కాప్షన్ కూడా పెట్టింది. 

ఇకపోతే.. ఈ లాక్ డౌన్ వల్ల అన్ని క్రీడా సంరంభాలు కూడా వాయిదా పడ్డాయి. షూటింగ్ ఛాంపియన్ షిప్ నుంచి మొదలు ఐపీఎల్ వరకు అన్ని క్రీడలు వాయిదా పడ్డాయి. నాలుగు సంవత్సరాలకోసారి జరిగే విశ్వా క్రీడా సంరంభమే వాయిదా పడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios