క్రమశిక్షణ తప్పి నిషేధానికి గురైన పాకిస్థాన్ సీనియర్ వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ ఉమర్ అక్మల్‌‌పై విమర్శల పర్వం కొనసాగుతోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్‌)‌లో ఫిక్సింగ్‌ కోసం ఈ ఏడాది ఆరంభంలో బుకీలు ఉమర్‌ అక్మల్‌ని సంప్రదించగా.. ఆ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అవినీతి నిరోధక శాఖ అధికారుల వద్ద ఉమర్ దాచాడు. దాంతో.. అతనిపై పీసీబీ మూడేళ్ల నిషేధం విధించింది.

కాగా.. ఉమర్ పై తాజాగా పీసీబీ మాజీ ఛైర్మన్ నజామ్‌ సేథీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమర్‌ ఒక మూర్చ రోగి అంటూ మరో  కొత్త వివాదానికి తెరలేపారు. తాను పీసీబీ చైర్మన్‌గా,ఎగ్జిక్యూటివ్‌ కమిటీ హెడ్‌గా ఉన్నసమయంలో తాను ఎదుర్కొన్న తొలి సమస్య ఉమర్‌దేనని పేర్కొన్నారు. ఉమర్‌కు మూర్చ ఉన్నట్లు అప‍్పటి మెడికల్‌ రిపోర్ట్‌ల్లో వెల్లడైందని, కానీ దానిని సెలక్షన్‌ కమిటీ సీరియస్‌గా తీసుకోలేదన్నారు. 

అతనికి మూర్చ ఉండటం వల్లే వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడని సేథీ తెలిపారు.  అయితే తనకు మూర్చ రోగిననే విషయాన్ని అంగీకరించడానికి ఉమర్‌ సిద్ధంగా లేడనే విషయాన్ని కూడా ఆయన తేల్చిచెప్పారు. గత తన పీసీబీకి చేసిన సేవల్లో ఉమర్‌తో పెద్ద సమస్యగా ఉండేదన్నారు. 

దాంతోనే రెండు నెలల పాటు అతన్ని క్రికెట్‌కు దూరంగా పెట్టానని, ఆ తర్వాత సెలక్షన్‌ కమిటీ లైట్‌గా తీసుకోవడంతో క్రికెట్‌ను తిరిగి కొనసాగించడన్నాడు. సెలక్షన్‌ కమిటీ విషయాల్లో తలదూర్చకూడదనే ఉద్దేశంతోనే తాను అప్పుడు మౌనంగా ఉండిపోయానన్నాడు.

ఇప్పుడు ఉమర్‌పై మూడేళ్ల నిషేధం పడటంతో అతని కెరీర్‌ గిసిపోయినట్లేనని సేథీ తెలిపారు. తాను ఎప్పుడూ ఉమర్‌ కెరీర్‌ గురించి ఆందోళన చెందుతూనే ఉండేవాడినని,  నియమావళిని అతిక్రమించడంతో అతని కెరీర్‌ను నాశనం చేసుకున్నాడన్నాడు.