కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో ఎప్పుడూ తీరిక లేకుండా గడిపే క్రికెటర్లు తమ కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కూడా భార్య సాక్షి, కుమార్తె జీవాతో కలిసి రాంచీలోని తన ఫామ్ హౌస్‌లో గడుపుతున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సాక్షి సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ధోనీ తన భార్యాపిల్లలతో కలిసి పెంపుడు కుక్కతో ఆడుకుంటున్న దృశ్యాలను సాక్షి సోషల్ మీడియాలో పెట్టారు.

Also Read:ఫ్యాన్స్ తో కేఎల్ రాహుల్ చిట్ చాట్... చాహల్ టిక్ టాక్ పై ఫన్నీ కామెంట్

ఈ వీడియోలో ధోనీ ఓ టెన్నిస్ బాల్‌ను క్యాచ్ పట్టుకోవాల్సిందిగా కుక్కకు  విసిరాడు. తాను అక్కడున్నంత వరకు కుక్క నీ మాట వినదు అంటూ సాక్షి.. ధోనీకి తెలిపింది. దీంతో ఆమె కుక్కను కూర్చోమని చెప్పి, అనంతరం బంతిని ధోని పైకి విసరగా కుక్క క్యాచ్ పట్టుకుంది.

మధ్యలో ధోనీ కూతురు జీవా కూడా చేరగా, సాక్షి బంతిని ఈసారి చాలా ఎక్కువ దూరం విసిరింది. దానిని అందుకోవడానికి కుక్క పరుగులు తీసి బంతిని అందుకోవడానికి గాల్లోకి ఎగిరింది.

Also Read:కేఎల్ రాహుల్ కి బౌలింగ్ చేయడం కష్టం, ఉతికి ఆరేస్తాడు: జోఫ్రా ఆర్చర్

నెరిసిన గడ్డంతో స్టైలిష్ లుక్‌లో ధోని ఈ వీడియోలో కనిపించాడు. గార్డెన్‌లో పచ్చిక బాగా పెరిగిందని.. దీనిని కత్తిరించాలంటూ సాక్షి చెబుతున్న మాటలను కూడా వినవచ్చు. ఈ వీడియో చివరిలో ధోనీ బంతిని తన వెనుక దాచుకోగా.. కుక్క దానిని లాక్కుంటుంది.

38 ఏళ్ల ధోనీ గత ఏడాది వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాతి నుంచి తిరిగి టీమిండియా జెర్సీ వేసుకోలేదు. అయితే ఐపీఎల్‌లోనైనా తమ అభిమాన క్రికెటర్‌ను చూడాలని భావించిన వారికి కరోనా షాకిచ్చింది. లాక్‌డౌన్ కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.