కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. ఈ కరోనా వైరస్ తో క్రీడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ జరగాల్సిన అన్ని క్రీడలు ఆగిపోయాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే కుటుంబసభ్యులతో గుడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు.

టీమిండియా యువ క్రికెటర్ కేఎల్ రాహుల్ తాజాగా..సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో చిట్ చాట్ చేశారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కాగా రాహుల్ చెప్పిన ఆన్సర్లు.. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా చాహల్ టిక్ టాక్ పై ఓ అభిమాని ప్నశ్నించగా.. దానికి రాహుల్ చెప్పిన సమాధానం చాలా ఫన్నీగా ఉండటం విశేషం.

చాహల్ టిక్ టాక్ పై మీ అభిప్రాయం ఏమిటి అంటూ ఓ అభిమాని ప్రశ్నించగా... అతను మైదానంలో బౌలింగ్ గూగుల్స్ కి అతుక్కుంటే మంచిది అని రాహుల్ పేర్కొన్నారు.

మీ ఆల్​టైం ఫేవరెట్ బ్యాట్స్​మెన్ ఎవరు’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఏబీ డివిలియర్స్ అని రాహుల్ తెలిపాడు. అలాగే ఐపీఎల్​లో ప్రస్తుతం ఆడుతున్న కింగ్స్ ఎలెవెన్​ పంజాబ్ కాకుండా మరో ఇష్టమైన జట్టు ఏదంటే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అని చెప్పాడు. 

2013-14 రంజీ ట్రోఫీ గెలువడం కర్ణాటక తరఫున తనకు అత్యంత అద్భుతమైన క్షణాలు అని రాహుల్ తెలిపాడు. గతంలో రాయల్​ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఏబీ డివిలియర్స్​, కేఎల్ రాహుల్ కలిసి ఆడారు. ప్రస్తుతం ఏబీ.. బెంగళూరు జట్టుతోనే ఉండగా.. రాహుల్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు.