'మాకు డబ్బులు లేవు సార్'.. టాప్ కుర్రోళ్లపైనే ముంబై టార్గెట్..
Mumbai Indians: తక్కువ పర్సుతో ముంబై ఇండియన్స్ 2026 ఆక్షన్ బరిలోకి దిగుతోంది. తమ బలమైన కోర్ టీమ్‌ను నిలబెట్టుకున్న MI.. ఓపెనర్లు, మూడో స్థానం బ్యాటర్, విదేశీ పేసర్, భారత స్పిన్ ఆల్‌రౌండర్‌లను లక్ష్యంగా చేసుకుంటోంది.

తక్కువ డబ్బుతో బరిలోకి..
ముంబై ఇండియన్స్ 2026 ఐపీఎల్ మినీ వేలానికి వ్యూహాన్ని సిద్దం చేస్తోంది. గత సీజన్‌లో క్వాలిఫైయర్ వరకు చేరుకున్న ఈ జట్టు.. తమ కోర్ టీమ్‌ను దాదాపుగా అలాగే ఉంచుకుంది. మొత్తం 20 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, వారిలో ఏడుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు ముంబైకి కేవలం రూ. 2.75 కోట్ల లోయెస్ట్ పర్స్ ఉంది.
ప్లేయింగ్ ఎలెవన్ ఇలా..
ప్రస్తుతం ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా, సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో, విల్ జాక్స్ నాలుగో స్థానంలో, తిలక్ వర్మ ఐదో స్థానంలో, నమన్ ధీర్ ఆరో స్థానంలో, హార్దిక్ పాండ్యా ఏడో స్థానంలో, మిచెల్ శాంట్నర్ ఎనిమిదో స్థానంలో, దీపక్ చాహర్ తొమ్మిదో స్థానంలో, ట్రెంట్ బౌల్ట్ పదో స్థానంలో, జస్‌ప్రీత్ బుమ్రా పదకొండో స్థానంలో, ఇంపాక్ట్ ప్లేయర్‌గా మయాంక్ మార్కండే ఆడతారని అంచనా.
బ్యాకప్ ఓపెనర్, మూడో స్థానం బ్యాటర్..
రూ. కోటిలోపు లభించే ఆటగాళ్ల కోసం MI ప్రయత్నించవచ్చు. తమిళనాడుకు చెందిన వికెట్ కీపర్ తుషార్ రహేజా ఫస్ట్ ఆప్షన్. అలాగే కార్తీక్ శర్మ, తేజస్వి దహియా, సలీల్ అరోరా, సంస్కార్ రావత్, వంశ్ వేది, లువ్నీత్ సిసోడియా, ఉపేంద్ర సింగ్ యాదవ్ లాంటి ఇతర కీపర్, ఓపెనింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. అటు మూడో స్థానం కోసం ఆర్యన్ జుయల్, షేక్ రషీద్, కునాల్ చందేలా మంచి ఆప్షన్లుగా ఉన్నారు.
విదేశీ పేసర్ కోసం..
ట్రెంట్ బౌల్ట్, కార్బిన్ బోష్‌లు మాత్రమే విదేశీ పేసర్లుగా ఉన్నందున వారి ఫామ్ లేదా గాయాల సమస్యలకు బ్యాకప్‌గా మరో పేసర్ అవసరం. కైల్ జేమిసన్, మాట్ హెన్రీ, షమర్ జోసెఫ్, వియాన్ ముల్డర్ లాంటి టాప్ ఛాయిసెస్‌గా ఉన్నారు. ఇక జట్టుకు భారత స్పిన్ ఆల్‌రౌండర్ కూడా అవసరం. తనుష్ కోటియన్ బెస్ట్ ఆప్షన్.
పక్కాగా ఖర్చు చేయాలి..
MI తన రూ. 2.75 కోట్ల బడ్జెట్‌ను పక్కాగా ఉపయోగించాలి. విదేశీ పేసర్‌కు రూ. కోటి, భారతీయ ఓపెనర్‌కు 50 లక్షలు, మూడో స్థానం బ్యాటర్‌కు 50 లక్షలు, భారతీయ ఆల్‌రౌండర్‌కు 40 లక్షలు. మిగిలిన 35 లక్షలతో మరో భారతీయ ఫాస్ట్ బౌలర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇలా జట్టును బలోపేతం చేసుకోనుంది ముంబై.

