RCB పక్కా టార్గెట్ వీరే.! ప్రతీ సెట్‌లోనూ ఈ ప్లేయర్స్‌పై కన్ను.. ఎవరెవరంటే.?
RCB: 18 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా పుంజుకుని ఐపీఎల్ టైటిల్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. రూ. 16.40 కోట్ల పర్స్‌తో ఎనిమిది స్థానాలను(రెండు విదేశీ స్లాట్లు) భర్తీ చేసుకోనుంది.

రూ. 16.40 కోట్ల పర్స్.. 8 స్లాట్స్..
ఐపీఎల్ మినీ వేలం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్దంగా ఉంది. తమ జట్టును బలోపేతం చేసుకునేందుకు పక్కా ప్రణాళికలను సిద్దం చేసింది. ప్రస్తుతం ఆర్సీబీ దగ్గర రూ. 16.40 కోట్ల పర్స్ ఉంది. ఎనిమిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో రెండు విదేశీ స్లాట్లు ఉన్నాయి. జట్టుకు ప్రధానంగా ఒక నంబర్ 5 బ్యాటర్, మిడిల్ ఓవర్స్ బౌలర్, బ్యాకప్ నంబర్ 3 బ్యాటర్, విదేశీ పేసర్, భారత బ్యాకప్ ఓపెనర్, భారత ఫినిషర్, ఒక విదేశీ స్పిన్నర్ అవసరం. దీనికి తగ్గట్టుగా వేలంలో ఆ జట్టు ఆప్షన్స్ ఉండనున్నాయి.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఇలా
మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల విషయానికొస్తే సర్ఫరాజ్ ఖాన్ ఆర్సీబీకి ఫస్ట్ ఆప్షన్. సుమారు రూ. 3 కోట్లతో దొరకవచ్చు. ఒకవేళ సర్ఫరాజ్ దొరక్కపోతే.. దీపక్ హుడాను రెండో ఆప్షన్‌గా బెంగళూరు చూడనుంది. హుడా రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. బడ్జెట్ లోనే దొరుకుతాడు.
విదేశీ పేసర్ల కోసం..
విదేశీ పేసర్ల కోసం, గెరాల్డ్ కోయిట్జీ ఉన్నాడు. అతడి కోసం సుమారు రూ. 4 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. బడ్జెట్ లో కావాలంటే స్పెన్సర్ జాన్సన్.. లేదా ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియాలు ఉన్నారు. చేతన్ సకారియా మిడిల్, డెత్ ఓవర్లకు క్వాలిటీ బౌలర్. యశ్ దయాల్‌కు సరైన ప్రత్యామ్నాయం.
విదేశీ స్పిన్నర్ ఇలా..
విదేశీ స్పిన్నర్‌గా ముజీబుర్ రెహ్మాన్ ఆర్సీబీకి బాగా సూట్ అవుతాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. లేకపోతే మైకెల్ బ్రేస్‌వెల్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. భారత బ్యాకప్ ఓపెనర్‌ల విషయానికొస్తే.. అన్మోల్‌ప్రీత్ సింగ్, తుషార్ రహేజా, కార్తీక్ శర్మలను ఆర్సీబీ లక్ష్యంగా చేసుకుంది. సీనియర్ ఆటగాళ్లు కావాలంటే మయాంక్ అగర్వాల్ లేదా రాహుల్ త్రిపాఠిని కూడా పరిశీలించవచ్చు.
భారత ఫినిషర్ అయితే..
భారత ఫినిషర్‌గా సల్మాన్ నిజార్, బ్యాకప్ నంబర్ 3 బ్యాటర్‌గా కునాల్ చాందేలా లేదా అభిమన్యు ఈశ్వరన్‌లను కూడా ఆర్సీబీ గురి పెట్టొచ్చు. మిడిల్, డెత్ ఓవర్ల బౌలర్‌గా ఆకాశ్ మధ్వాల్‌ను ఆర్సీబీ టీమ్ లోని గ్యాప్స్ ను పూడ్చగలను అని భావిస్తోంది. ఈ సమగ్రమైన ప్రణాళికతో, ఆర్సీబీ రాబోయే వేలంలో సమతుల్యమైన మరియు బలమైన జట్టును నిర్మించుకోవాలని చూస్తోంది.

