సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పర్సనల్, క్రికెట్ సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకునేవాడు. ఈ నేపథ్యంలో తన ఇన్‌స్టాగ్రామ్‌ 1000వ పోస్టును ఫ్యాన్స్‌కు అంకితం చేశాడు.

ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మీ ప్రేమ, ఆదరణకు కృతజ్ఞుడను అంటూ ఉద్వేగంగా చెప్పాడు. అలాగే ఈ పోస్టులో 2008 నాటి మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోను జతచేస్తూ.. 2008 టూ 2020 అంటూ క్యాప్షన్ పెట్టాడు.

Also Read:సుప్రీంకోర్టులో బంతి: గంగూలీ, జై షా ల భవితవ్యం పై విచారణ

విరాట్ చేసిన పోస్టుల్లో ఒకదానికి భార్య అనుష్క శర్మ స్పందిస్తూ లవ్ ఏమోజీని పెట్టారు. మరోవైపు తమ అభిమాన క్రికెటర్ పెట్టిన ఫ్యాన్స్‌ కూడా ఎమోషనల్ అయ్యారు. లవ్ యూ విరాట్ సర్ అంటూ పోస్ట్ చేస్తున్నారు.

2008లో వన్డే సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన విరాట్ అప్పటి నుంచి మోస్ట్ సక్సెస్‌ఫుల్ క్రికెటర్‌గా కెరీర్ కొనసాగిస్తున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా జట్టును నడిపిస్తూనే పరుగుల యంత్రంలా పలు రికార్డులను బద్ధులు కొట్టి తన మార్క్‌తో ప్రత్యేక క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు.

Also Read:టి20 ప్రపంచకప్ తో ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ..?

ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ ఇప్పటి వరకు 86 టెస్టులు ఆడి 7,240 పరుగులు చేశాడు. టీ 20లలో 2,794 పరుగులు చేశాడు. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కొనసాగుతున్నాడు.