బీసీసీఐ ఆఫీస్ బేరర్ల విషయంలో బీసీసీఐ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లోధా కమిట విధించిన నియమావళి అనుసారం బీసీసీఐ సెక్రటరీ జైషా పదవీ కలం ముగిసింది. త్వరలో గంగులీధి కూడా ముగియబోతుంది. ఈ తరుణంలో వారికి ఒక ఊరట లభించింది. 

నూతన రాజ్యాంగం అనుసారం పదవీ కాలం ముగించుకున్న కార్యదర్శి జై షా, జులై 27న ముగించుకోనున్న అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీలు తక్షణమే తప్పుకోవాలా..? లేదా పూర్తి కాలం పదవీలో కొనసాగాలా.. ? అనే అంశం పై సుప్రీమ్ కోర్టు బీసీసీఐ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.  

ఇక ఇప్పుడు వారి భవితవ్యం సుప్రీమ్ వెలువరించబోయే తీర్పుపై ఆధారపడి ఉంది. మూడేండ్ల విరామ సమయం బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు వేర్వేరుగా చూడాలని, రాజ్యాంగ సవరణకు సుప్రీంకోర్టు అనుమతి అవసరం లేదని, మేనేజ్‌మెంట్‌ విషయాల్లో అన్ని అధికారాలు తిరిగి కార్యదర్శికే దఖలు పరచాలని కోరుతూ ఏప్రిల్‌ 21న బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేసింది. 

జూన్‌ 30తో జై షా పదవీ కాలం ముగిసిపోయినా ఇంకా సమావేశాలకు హాజరు అవుతున్నారు. మరో వారంలో గంగూలీ సైతం విరామ సమయంలోకి అడుగుపెట్టనున్నాడు. దీంతో బీసీసీఐ నాయకత్వం సంక్షోభం ఎదుర్కొనుంది. 

బీసీసీఐ పిటిషన్‌ను సుప్రీంకోర్టుకు ఎట్టకేలకు విచారణకు స్వీకరించనుంది. మరో రెండు వారాల్లో ఈ పిటిషను బెంచ్‌ ముందుకు రానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డె, జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వర్‌ రావులు బీసీసీఐ పిటిషన్‌పై వాదనలు విననున్నారు.