విరాట్ కోహ్లీ... క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. అతడు గొప్ప బ్యాట్స్ మెన్ మాత్రమే కాదు అత్యుత్తమ  కెప్టెన్ కూడా. టీమిండియా పగ్గాలు చేపట్టినప్పటి నుండి జట్టును విజయపథంలో నడిపించడంలో అతడు సక్సెస్ అయ్యాడు. ఇక  అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో పరుగుల వరద పారించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఇలా అభిమానులను తన మార్కు క్రికెట్ షాట్లతో అలరిస్తుంటాడు. అయితే తాను కేవలం క్రికెట్ తోనే కాదు డ్యాన్స్ తో అభిమానులను ఎంటర్టైన్ చేయగలనని కోహ్లీ నిరూపించాడు. 

గయానా వేదికన టీమిండియా-వెస్టిండిస్ ల మధ్య జరిగాల్సిన మొదటి వన్డే వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఎలాగూ బ్యాటింగ్ తో అభిమానులను అలరించే అవకాశం లేదు కాబట్టి తన డ్యాన్స్ తో అయినా వారిని ఎంటర్టైన్ చేయాలని కోహ్లీ భావించినట్లున్నాడు. అతడు ఈ మ్యాచ్ కోసం మైదానంలో కొద్దిసేపే వున్నప్పటికి అంతలోపే పలుమార్లు సరదాగా స్టెప్పెలేస్తూ కనిపించాడు. 

మొదట కోహ్లీ జట్టులోని సహచరులతో  కలిసి డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి బౌండరీ వద్ద, మైదానాన్ని సిద్దంచేయడానికి  వచ్చిన సిబ్బందితో కలిసి స్టెప్పులేశాడు. ఇక చివరగా వెస్టిండిస్ దిగ్గజం క్రిస్ గేల్ తో కలిసి పాదం కదిపాడు. ఇలా అతడు మైదానంలో వున్నంత సేపు సరదాగా  చిందులేస్తూనే కనిపించాడు. ఇలా కోహ్లీ చిన్న చిన్న స్టెప్పులతో అదరగొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అయితే భారత్-వెస్టిండిస్ ల మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ కు వర్షం ఆరంభం నుండి అడ్డుతగిలింది. మద్యమద్యలో అంతరాయం కలిగిస్తూ చివరకు మ్యాచ్ రద్దయ్యేలా చేసింది. విండీస్ స్కోరు 13 ఓవర్లలకు 54/1 వద్ద వుండగా ఆగిపోయిన ఈ మ్యాచ్ చివరకు ఫలితం తేలకుండానే రద్దయింది. దీంతో మూడు వన్డేల సీరిస్ లో ఇక రెండే మ్యాచ్ లు మిగిలాయి. ఈ  రెండింటిని ఏ జట్టు గెలిస్తే సీరిస్ వారి సొంతమవుతుంది. అంటే టీ20 సీరిస్ మాదిరిగానే టీమిండియా వన్డే సీరిస్ ను కూడా క్లీన్ స్వీప్ చేయాలన్నమాట. 

సంబంధిత వార్తలు

కరుణించని వరుణుడు...తుడిచిపెట్టుకుపోయిన ఇండియా-వెస్టిండిస్ మొదటి వన్డే

మధ్య మధ్యలో వర్షమేంటీ.. చెత్తగా: తొలి వన్డే రద్దుపై కోహ్లీ వ్యాఖ్యలు