భారత్-వెస్టిండిస్ మద్య గయనా వేదికన జరగాల్సిన మొదటి వన్డే ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ మ్యాచ్ కు వర్షం ఆరంభం నుండి అడ్డుతగిలింది.అయితే మధ్యలో కాస్సేపు తగ్గడంతో కొద్దిసేపు మ్యాచ్ జరిగింది. అయితే మళ్లీ మద్యమద్యలో అంతరాయం కలిగిస్తూ చివరకు మ్యాచ్ రద్దయ్యేలా చేసింది.మూడు వన్డేల సీరిస్ లో ఇక రెండె మ్యాచ్ లు మిగిలాయి. ఈ  రెండింట్లో ఏ జట్టు గెలిస్తే సీరిస్ ఆ జట్టును వరిస్తుంది. 

విండీస్ స్కోరు 13 ఓవర్లలకు 54/1 వద్ద వుండగా మరోసారి మ్యాచ్ కు  వర్షం  ఆటంకం కలిగించింది. ఈ మ్యాచ్ ను 34 ఓవర్లకు కుదించి ఆడించాలనుకున్నా అదికూడా సాధ్యపడలేదు.

భారత్-వెస్టిండిస్ మ్యాచ్ కు వరుణుడు మరోసారి అడ్డుపడ్డాడు. విండీస్ 5.4 ఓవర్లలో వికెట్లేవీ నష్టపోకుండా తొమ్మిది పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా జోరున వర్షం మొదలయ్యింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు.  

వర్షం కారణంగా టీమిండియా-వెస్టిండిస్ ల మధ్య మొదటి వన్డే ఆలస్యంగా మొదలయ్యింది. దీంతో మ్యాచ్ ను 40 ఓవర్లకు కుదించారు. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోహ్లీసేన ముందుగా పీల్డింగ్ ఎంచుకుంది. దీంతో వెస్టిండిస్ బ్యాటింగ్ కు దిగింది. 

టీ20 సీరిస్ క్లీన్ స్వీప్ ద్వారా వెస్టిండిస్ టూర్ లో భారత్ కు మంచి శుభారంభం లభించింది. ఇదే ఊపుతో వన్డే సీరిస్ లో కూడా విండీస్ తో ఓ ఆటాడుకుందామని అనుకుంటున్న టీమిండియాకు వర్షం అడ్డంకిగా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(గురువారం) ఇప్పటికే  టాస్ జరగాల్సి వుండగా  వర్షం కారణంగా ఆలస్యమవుతోంది. దీంతో మ్యాచ్ కూడా ఆలస్యంగా ఆరంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. 

గయానా లో ఇవాళ ఉదయం నుండి వర్షం కురుస్తూనే వున్నట్లు సమాచారం. అయితే మధ్య మధ్య లో కొద్దిసేపు విరామం ఇస్తూ మళ్లీ ఒక్కసారిగా వర్షం మొదలవుతోందట. దీంతో పిచ్ తడవకుండా వుండేందుకు కవర్లను అలాగే కప్పివుంచారు.  


భారత తుది జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కేదార్ జాదవ్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్, కుల్‌దీప్ యాదవ్