టీ20 వరల్డ్‌కప్ 2021: 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసిన శ్రీలంక... 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లంకను ఆదుకున్న హసరంగ, నిశ్శక... 

T20 వరల్డ్‌కప్ 2021టోర్నీ గ్రూప్ ఏలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది...టాస్ గెలిచి, శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగించింది ఐర్లాండ్. కెప్టెన్ నిర్ణయానికి గౌరవిస్తూ, మొదటి రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు తీసి అదరగొట్టారు ఐర్లాండ్ బౌలర్లు... 

కుశాల్ పేరారా ఇన్నింగ్స్ రెండో బంతికే గోల్డెన్ డకౌట్ కాగా ఆ తర్వాతి ఓవర్‌లో రెండు వికెట్లు తీసి లంకకు ఊహించని షాక్ ఇచ్చాడు ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్. దినేశ్ చండీమల్ 6 పరుగులు చేసి జోషువా బౌలింగ్‌లో బౌల్డ్ కాగా, ఆ తర్వాతి బంతికే ఆవిష్క ఫెర్నాండో కూడా గోల్డెన్ డకౌట్ అయ్యాడు..

Must READ: T20 worldcup 2021: ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం... రోహిత్, కెఎల్ రాహుల్...

8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టును ఓపెనర్ నిశ్శంక, వానిందు హసరంగ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 123 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు... టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో నాలుగో వికెట్‌కి ఇదే అత్యుత్తమ పార్టనర్‌షిప్ కావడం విశేషం...చ 2007లో ఆస్ట్రేలియాపై పాక్ బ్యాట్స్‌మెన్ మిస్బా వుల్ హక్, షోయబ్ మాలిక్ కలిపి నెలకొల్పిన 119 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించారు హసరంగ, నిశ్శంక జోడీ...

ఇది చదవండి: T20 worldcup 2021: రోహిత్ కెప్టెన్సీలో ఆల్‌రౌండర్‌గా కోహ్లీ... వార్మప్ మ్యాచ్‌లో విరాట్ బౌలింగ్‌‌పై...

47 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 71 పరుగులు చేసిన హసరంగ, మార్క్ అడైర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.. ఆ తర్వాత భనుక రాజపక్ష 1 పరుగుకే జోషువా లిటిల్ బౌలింగ్‌లో అవుట్ కాగా... ఓపెనర్ నిశ్శక మాత్రం దూకుడు కొనసాగించాడు...

47 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులు చేసిన నిశ్శక కూడా జోషువా లిటిల్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు... ఆఖరి ఓవర్‌లో కరుణరత్నేని అవుట్ చేసిన మార్క్ అడైర్, టీ20ల్లో 50 అంతర్జాతీయ వికెట్లు పూర్తిచేసుకున్నాడు. 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చిన జోషువా లిటిల్, నాలుగు వికెట్లు తీసి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. 

ఆఖర్లో దసున్ శనక 11 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేయడంతో భారీ స్కోరు చేయగలిగింది శ్రీలంక. 

ఇవీ చదవండి: రిషబ్ పంత్‌కి ఛాన్సే లేదు, విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీ20 కెప్టెన్... భారీ ఈవెంట్‌ పెట్టి మరీ...

నేను, విరాట్, సూర్య... అవసరమైతే మేం ముగ్గురం బౌలింగ్ చేస్తాం... రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మోత మోగించిన సిక్సర్ల వీరులు వీరే... యువరాజ్ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..

ధోనీ కింద పడుకుని, నాకు తన బెడ్ ఇచ్చాడు, మాహీయే నా లైఫ్ కోచ్... - హార్దిక్ పాండ్యా...

టీ20 వరల్డ్‌కప్ 2021: రద్దు దిశగా భారత్, పాక్ మ్యాచ్‌?... కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్లతో...