Asianet News TeluguAsianet News Telugu

IND vs PAK : భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్క‌డ లైవ్ ఉచితంగా చూడ‌వ‌చ్చు?

IND vs PAK : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో భాగంగా భార‌త్-పాకిస్తాన్ జ‌ట్లు జూన్ 9 (ఆదివారం) త‌ల‌ప‌డ‌నున్నాయి. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ క‌ప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు గతంలో ఏడుసార్లు తలపడ్డాయి. ఇందులో ఆరు సార్లు భార‌త్ గెలిచింది.
 

T20 World Cup 2024 : IND vs PAK  Live Streaming: When and where to watch India vs Pakistan live? RMA
Author
First Published Jun 8, 2024, 6:24 PM IST

IND vs PAK T20 World Cup 2024: భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే మాములు క్రేజ్ ఉండ‌దు. ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ కు స‌ర్వం సిద్ధ‌మైంది. ఆదివారం న్యూయార్క్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ లు త‌ల‌ప‌డనున్నాయి. ఈ హై ఓల్టేజీ మ్యాచ్ కు ముందు న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని పిచ్  హాట్ టాపిక్ గా  మారింది. ఏదేమైనా ఈ మ్యాచ్  కోసం యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచ ఎంత‌గానో ఎదురుచూస్తోంది. మ‌రీ మ్యాచ్ ఎప్పుడు, ఎక్క‌డ జ‌రుగుతుంది?  భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ ను ఎక్క‌డ ఉచితంగా లైవ్ చూడ‌వ‌చ్చు? విషయాలు మీకోసం..

ఇండియా-పాకిస్థాన్  మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్క‌డ చూడ‌వ‌చ్చు? 

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఇండియా vs పాకిస్తాన్ లు న్యూయార్క్ లోని నాసావు కౌంటీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. భారత్ vs పాకిస్థాన్  మ్యాచ్ జూన్ 9 ఆదివారం రాత్రి 8 గంటలకు (IST) ప్రారంభమవుతుంది.

భారతదేశం vs పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మొత్తం టీ20 ప్రపంచ కప్ 2024 టెలికాస్టింగ్ హక్కులను కలిగి ఉంది. అలాగే, ప్రత్యక్ష ప్రసారాలు Disney+Hotstarలో కూడా అందుబాటులో ఉంటుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వ‌ర్క్ ఛానెల్ తో పాటు డిస్నీ+ హాట్ స్టార్ లో కూడా లైవ్ స్ట్రీమ్ చూడ‌వ‌చ్చు.

ఇరు జ‌ట్ల అంచ‌నాలు ఇవే.. 

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

పాకిస్థాన్ : బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫకార్ జమాన్, హారిస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.

ఇది మాములు ర‌చ్చ కాదు.. భారత్‌తో మ్యాచ్ కు ముందే పాకిస్తాన్ ను ఆటాడుకుంటున్న జొమాటో, స్విగ్గీ..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios