ఇది మాములు రచ్చ కాదు.. భారత్‌తో మ్యాచ్ కు ముందే పాకిస్తాన్ ను ఆటాడుకుంటున్న జొమాటో, స్విగ్గీ..
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024 లో యూఎస్ఏ చేతిలో ఘోర పరాజయం తర్వాత పాకిస్తాన్ జట్టు విమర్శలకు టార్గెట్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో అయితే, మీమ్స్, ట్రోల్స్ తో ఓ రెంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాక్ జట్టుపై జొమాటో, స్విగ్గీ చేసిన పోస్టు వైరల్ గా మారింది.
T20 World Cup 2024 : మంచి అంచనాలతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 లో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టుకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. తమకంటే చిన్న జట్టు అయినప్పటికీ అద్భుతమైన పోరాటంతో ఎవరూ ఊహించని విధంగా అమెరికా జట్టు పాకిస్తాన్ ను చిత్తు చేసింది. తొలుత మ్యాచ్ ను టై చేసుకుని సూపర్ ఓవర్ కు తీసుకెళ్లిన అమెరికా.. పాక్ పై సూపర్ ఓవర్ లో సూపర్ విక్టరీని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సూపర్ ఓవర్ లో పాక్ ఆటగాళ్ల ఫీల్డింగ్ పై గల్లీ క్రికెట్ మాదిరిగా కూడా లేకపోయింది. దీంతో ఆ జట్టు ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి.
ఇదే క్రమంలో యూఎస్ఏ చేతిలో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రదర్శనపై జొమాటో తనదైన స్టైల్లో కామెంట్స్ చేసి జట్టు తీరును వ్యంగ్యంగా ఎండగట్టింది. ప్రపంచ కప్ లో తొలిసారి ఆడుతున్న అమెరికా జాతీయ క్రికెట్ జట్టు సూపర్ ఓవర్ లో పాకిస్థాన్ పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ ను టార్గెట్ చేసిన జొమాటో ఎక్స్ లో చేసిన ఒక పోస్టులో.. ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ పాకిస్తాన్ ను "బ్రో" అని సంబోధించి, "సండే కో యాడ్ స్లాట్స్ లే యా నా" అంటూ చమత్కారమైన కామెంట్స్ తో ట్రోల్ కు తెరలేపింది.
జొమాటో ప్రత్యర్థి అయిన స్విగ్గీ తాము తక్కువేమి కాదంటూ.. "లగ్తా హై యుఎస్ఎ జా కే జ్యాదా బర్గర్ పిజ్జా ఖా లియే" అని తనదైన స్టైల్లో పాక్ జట్టును ఎగతాళి చేసింది. పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. భారత్ లో రెండు ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ లు పాకిస్తాన్ జట్టును టార్గెట్ చేయడంతో ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాను ముంచెత్తాయి.
భారత్ వర్సెస్ పాకిస్తాన్..
ఇదిలావుండగా, టీ20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్లు జూన్ 9 (ఆదివారం) తలపడనున్నాయి. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు గతంలో ఏడుసార్లు తలపడ్డాయి. అయితే, ఇందులో ఆరు సార్లు భారత్ గెలిచింది. ఒక్కసారి మాత్రం పాక్ విజయాన్ని అందుకుంది.
T20 WORLD CUP 2024: చివరి ఓవర్ వరకు ఉత్కంఠ.. శ్రీలంకపై బంగ్లాదేశ్ థ్రిల్లింగ్ విక్టరీ