Asianet News TeluguAsianet News Telugu

హార్దిక్ పాండ్యాను ముద్దు పెట్టుకున్న రోహిత్ శ‌ర్మ.. వీడియో

T20 World Cup 2024 winner India: ఫైన‌ల్ మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికాను ఓడించి టీమిండియా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఛాంపియ‌న్ గా నిలిచింది. ఫైన‌ల్ మ్యాచ్ గెలుపులో విరాట్ కోహ్లీ, అక్ష‌ర్ ప‌టేల్ కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. ఫైన‌ల్ లో గెలిచిన త‌ర్వాత టీమిండియా ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యాలు ఎమోష‌న‌ల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. 

Rohit Sharma kisses Hardik Pandya after winning the T20 World Cup 2024 final, Watch Video RMA
Author
First Published Jun 30, 2024, 1:42 AM IST

T20 World Cup 2024 winner India: టీమిండియా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఛాంపియ‌న్ గా నిలిచింది. జూన్ 29న జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో భారత జ‌ట్టు దక్షిణాఫ్రికాతో తలపడింది. టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 176 ప‌రుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్ లు అద్భుత‌మైన బౌలింగ్ తో  ద‌క్షిణాఫ్రికాను 169/8 ప‌రుగుల‌కే ప‌రిమితం చేశారు. దీంతో భార‌త జ‌ట్టు 7 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. టీ20 ప్రపంచ క‌ప్ 2024 ఛాంపియ‌న్ గా నిలిచింది.

జూన్ 29న బార్బడోస్‌లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌లో జరిగిన అద్భుతమైన ఫైన‌ల్ మ్యాచ్ లో టీమిండియా టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. భార‌త్ ఛాంపియ‌న్ గా నిలిచిన త‌ర్వాత‌ కెప్టెన్ రోహిత్ శర్మ , ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మధ్య ఎమోషనల్ మూమెంట్స్ క‌నిపించాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్ కు భారత కెప్టెన్ రోహిత్ ముద్దు ఇచ్చాడు. అలాగే, మ్యాచ్ లో వీరిద్ద‌రూ ఎమోష‌న‌ల్ అవుతూ క‌న్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

 

 

జ‌య‌హో భార‌త్.. దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి 17 ఏండ్ల త‌ర్వాత ఛాంపియన్‌గా టీమిండియా

 

 

"చాలా విలువైనది. ఇది చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. మేము చాలా కష్ట‌ప‌డ్డాము. ఇది నాకు మరింత ప్రత్యేకమైనదని నేను భావిస్తున్నాను, గత ఆరు నెలలుగా నేను ఒక్క మాట కూడా మాట్లాడనందుకు కృతజ్ఞతతో ఉన్నాను. విషయాలు అన్యాయంగా ఉన్నాయి, కానీ నేను కష్టపడి పనిచేస్తే నేను ప్రకాశించే సమయం వస్తుందని నేను నమ్మాను. ఇది ప్రతిదీ సంగ్రహిస్తుంది అని నేను అనుకుంటున్నాను. గెలవాలనేది ఒక కల, ముఖ్యంగా ఇలాంటి అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను' అని మ్యాచ్ అనంతరం హార్దిక్ ప్యాండ్యా పేర్కొన్నాడు.

తాను ఎప్పుడు వంద‌శాతం ఆట‌ను ఇవ్వ‌డానికే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని పేర్కొన్నాడు. "మేము దీన్ని చేయగలమని మేము ఎల్లప్పుడూ నమ్ముతున్నాము. ఇది ప్రశాంతంగా ఉంచడం.. ప్రణాళికలను అమలు చేయడం గురించి మాత్రమే. వారిపై ఒత్తిడి తీసుకువ‌చ్చాం.. బుమ్రా, ఫాస్ట్ బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకుంటే చివ‌రి ఓవ‌ర్ల‌లో వారు అద్భుతంగా బౌలింగ్ చేశార‌ని కొనియాడారు. చివరిసారిగా భారత జట్టుకు కోచ్‌గా ఉన్న భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. "నేను ప్రశాంతంగా ఉండకపోతే అది నాకు సహాయం చేయదని నాకు తెలుసు. కాబట్టి, నేను నా ప్రణాళికలను అమలు చేయడం, నేను బౌల్ చేసే ప్రతి బంతికి నా వంద శాతం ఇచ్చేలా చూసుకోవడం నాకు చాలా సులభం. నేను ఇంతకు ముందు ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను గెలిచి ఉండకపోవచ్చు కానీ నేను ఎప్పుడూ ఒత్తిడిని ఆనందిస్తాను. ఒక్కసారిగా నా పరుగు వేగం పెరుగుతుంది. ఇప్పుడు ఇది అద్భుతంగా ఉందని" గెలుపు గురించి పేర్కొన్నాడు. రాహుల్ ద్ర‌విడ్ తో క‌లిసి ప‌నిచేయ‌డం నిజంగా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపాడు.

VIRAT KOHLI : ఫ్యాన్స్ కు గుండెలు ప‌గిలే న్యూస్ చెప్పిన విరాట్ కోహ్లీ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios