ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు.. సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర
KKR vs RR Sunil Narine : ఈడెన్ గార్డెన్స్‌లో సునీల్ నరైన్ తుఫాను తీసుకువచ్చాడు. ధనాధన్ బ్యాటింగ్ తో రాజస్థాన్ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ లో తొలి సెంచరీ కొట్టి అనేక రికార్డులు సృష్టించాడు.
![Sunil Narine is the only batsman in IPL history to take 100 wickets and score a century IPL 2024 KKR vs RR RMA Sunil Narine is the only batsman in IPL history to take 100 wickets and score a century IPL 2024 KKR vs RR RMA](https://static-ai.asianetnews.com/images/01hvkwn2ksb4pa7p16ynvqfftk/kkr-11_363x203xt.jpg)
IPL 2024 KKR vs RR Sunil Narine : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో సునీల్ నరైన్ సునామీ కొనసాగుతోంది. దుమ్మురేపే బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. 35 ఏళ్ల వెటరన్ సునీల్ నరైన్ ఐపీఎల్ 2024లో తన అద్భుత ఫామ్ ను కొనసాగిస్తూ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన పోరులో తన తొలి టీ20 సెంచరీని సాధించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన హోమ్ క్లాష్‌లో ఈ వెస్టిండీస్ స్టార్ 49 బంతుల్లో అద్భుతమైన శతకం సాధించడంతో కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 223/6 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కు మంచి శుభారంభం లభించలేదు. కానీ, సునీల్ నరైన్ నెమ్మదిగా తన ఇన్నింగ్స్ ను ప్రారంభించి దూకుడు పెంచుతూ దుమ్మురేపాడు. నరైన్ స్టేడియం అన్ని వైపులా అద్భుతమైన షాట్లను కొడుతూ స్టేడియం షేక్ చేశాడు. తన ఐపీఎల్ కెరీర్ లో తొలి సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ కొట్టడంతో పాటు 100 వికెట్లు సాధించిన తొలి ఆటగాడిగా సునీల్ నరైన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఏం కొట్టాడు భయ్యా.. నరైన్ మామా దెబ్బకు స్టేడియం షేక్ అయింది.. !
నరైన్ ఐపీఎల్లో 168 మ్యాచ్‌లు, టీ20ల్లో 503 మ్యాచ్‌లు ఆడిన సునీల్ నరైన్.. ఇప్పుడు సెంచరీతో అదరగొట్టాడు. తన సెంచరీ (109 పరుగులు) ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 6 సిక్సర్లను బాదాడు. 56 బంతుల్లో 109 పరుగుల వద్ద ఔటయ్యే ముందు మరో బౌండరీని బాదాడు. ఐపీఎల్లో సెంచరీ కొట్టిన మూడో కేకేఆర్ ప్లేయర్‌గా నరైన్ నిలిచాడు. అంతకుముందు కేకేఆర్ తరఫున బ్రెండన్ మెకల్లమ్, వెంకటేష్ అయ్యర్ లు సెంచరీలు కొట్టారు. సెంచరీ తర్వాత 18వ ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ ఒక అద్భుతమైన యార్కర్ తో సునీల్ నరైన్ ను ఔట్ చేశాడు. నరైన్ సెంచరీ ఇన్నింగ్స్ తో కేకేఆర్ 20 ఓవర్లలో 223/6 పరుగులు చేసింది. చివరలో రింకూ సింగ్ 9 బంతుల్లో 20 పరుగులతో మెరిశాడు.
ఐపీఎల్ కు గ్లెన్ మాక్స్వెల్ గుడ్ బై.. టీ20 ప్రపంచ కప్ జట్టులోనైనా ఉంటాడా?
ఐపీఎల్ లో ఇదే లాంగెస్ట్ సిక్సర్.. సూపర్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపిన దినేష్ కార్తీక్..