Dinesh Karthik's superb innings : బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ 2024 30వ మ్యాచ్ లో హైదరాబాద్ ప్లేయర్లు దంచి కొట్టాడు. ఛేజింగ్ లో బెంగళూరు ప్లేయర్లు సైతం దుమ్మురేపారు. ఈ మ్యాచ్ లో దినేష్ కార్తీక్ సూపర్ ఇన్నింగ్స్ తో ఐపీఎల్ 2024 లో భారీ సిక్సర్ బాదాడు.
IPL 2024 RCB vs SRH : బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ ల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బౌండరీల వర్షం కురిసింది. ఇరు జట్ల ప్లేయర్లు ధనాధన్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. తొలుత హైదరాబాద్ జట్టు మాస్ హిట్టింగ్ తో చెలరేగగా, ఆ తర్వాత సూపర్ షాట్లతో బెంగళూరు ప్లేయర్లు పోరాటం చేశారు. బెంగళూరు ఇన్నింగ్స్ లో దినేష్ కార్తీక్ మరోసారి తనదైన స్టైల్లో అదరగొట్టాడు. గ్రౌండ్ అన్ని వైపుల బౌండరీలు, సిక్సర్లు బాదాడు.
288 పరుగులు భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగళూరుకు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ మంచి ఆరంభం అందించారు. ఇద్దరూ బౌండరీలు, సిక్సర్ల అదరగొట్టారు. బెంగళూరు 6.2 ఓవర్లలో 80 పరుగులకు తొలి వికెట్ కోల్పోవడంతో (విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 42 పరుగులు) తర్వాత వచ్చిన విల్ జాక్స్ దురదృష్టవశాత్తు 7 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. రజత్ పాటిదార్ 9 పరుగులు చేసి, సౌరవ్ చౌహాన్ పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. యాక్షన్‌ను కొనసాగించిన డు ప్లెసిస్ 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. బెంగళూరు వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసి తదుపరి 42 పరుగులు చేసేలోపే 5 వికెట్లు కోల్పోయింది.
Fastest 100s in IPL : ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ టాప్-5 సెంచరీలు ఇవే...
దినేష్ కార్తీక్ దుమ్మురేపాడు..
బెంగళూరు జట్టు పోరాటం ముగిసిందని అభిమానులు భావిస్తున్న తరుణంలో దినేష్ కార్తీక్ రంగంలోకి దిగాడు. వస్తూనే హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో దుమ్మురేపాడు. మ్యాచ్ చివరివరకు క్రీజులో ఉండి బెంగళూరు విజయం కోసం పోరాటం సాగించాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. కానీ, మరో ఎండో ఎవరూ మంచి ఇన్నింగ్స్ ఆడకపోవడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. బెంగళూరు జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు మాత్రమే చేసింది.హైదరాబాద్ జట్టు 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అయితే, ఈ మ్యాచ్ లో దినేష్ కార్తీ తన ఇన్నింగ్స్ లో అద్భుతమైన షాట్స్ కొట్టాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 లో భారీ సిక్సర్ ను బాదాడు. నటరాజ్ వేసిన బంతిని 108 మీటర్లు కొట్టాడు దినేష్ కార్తీక్. ఈ బాల్ కొద్దిదూరంలో మిస్ అయి స్టేడియం రూఫ్ ను తాకి గ్రౌండ్ లో పడింది లేకుంటే స్టేడియం బయటపడేది. ఐపీఎల్ 2024 లో దినేష్ కార్తీక్ కొట్టిన ఈ సిక్సరే లాంగెస్ట్ సిక్సర్ కావడం విశేషం. అంతకుముందు ఇందే మ్యాచ్ లో నమోదైన భారీ సిక్సర్ ను దినేష్ కార్తీక్ బద్దలు కొట్టాడు. హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 106 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. అంతకుముందు నికోలస్ పూరన్ సైతం 106 మీటర్ల సిక్సర్ కొట్టాడు.
42 ఏండ్ల వయస్సులోనూ దుమ్మురేపాడు.. ధోని దెబ్బకు హార్దిక్ అబ్బా.. సరికొత్త రికార్డులు
అప్పుడు క్రిస్ గేల్.. ఇప్పుడు ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో బద్దలైన రికార్డులు ఇవే
