KKR vs RR Sunil Narine : కతానైట్ రైడర్స్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ దుమ్మురేపుతూ టీ20 ఫార్మాట్‌లో తన తొలి సెంచరీని అందుకున్నాడు. ఈ సూప‌ర్ సెంచ‌రీతో 4 వేల పరుగులు కూడా పూర్తి చేశాడు. 

IPL 2024 KKR vs RR Sunil Narine : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024 లో బ్యాట‌ర్ల హ‌వా కొన‌సాగుతోంది. దుమ్మురేపే ఇన్నింగ్స్ లతో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 31వ మ్యాచ్ లో కోల్ క‌తా ఆల్ రౌండ‌ర్ సునీల్ న‌రైన్ రాజ‌స్థాన్ బౌలింగ్ ను ఉతికిపారేశాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డుతూ త‌న ఐపీఎల్ కెరీర్ లో తొలి సెంచ‌రీ సాధించాడు.

ఐపీఎల్ 2024 31వ మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్-రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. టాస్ గెలిచిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన కోల్ క‌తా కు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. కేకేఆర్ ఓపెన‌ర్ ఫిలిప్ సాల్ట్ 10 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట్ అయ్యాడు. మ‌రో ఓపెన‌ర్ సునీల్ న‌రైన్ అద్భుతమైన ఇన్నింగ్స్ లో గ్రౌండ్ ను షేక్ చేశాడు. రాయ‌ల్స్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతూ సెంచ‌రీ కొట్టాడు. ఈ వెస్టిండీస్ స్టార్ 49 బంతుల్లోనే సెంచ‌రీ కొట్టాడు. 109 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 6 సిక్స‌ర్లు బాదాడు.

అరంభంలో కాస్త నెమ్మ‌దిగా క‌నిపించిన న‌రైన్ ఆ త‌ర్వాత దూకుడు పెంచాడు. రెండో వికెట్‌కు అంగ్క్రిష్ రఘువంశీ (30)తో కలిసి 85 పరుగులు జోడించాడు. ఆ త‌ర్వాత శ్రేయాస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్‌లతో కేకేఆర్ ఇన్నింగ్స్ ను కొన‌సాగిస్తూ సెంచ‌రీ కొట్టాడు. ఐపీఎల్ లో సెంచ‌రీతో పాటు 100 వికెట్లు తీసుకున్న ఏకైక ప్లేయ‌ర్ గా సునీల్ న‌రైన్ స‌రికొత్త రికార్డు సృష్టించాడు. అలాగే, తన 504వ టీ20 మ్యాచ్ ఆడుతున్న నరైన్ 15 సగటుతో 4,000 పరుగులు సాధించాడు. ఈ టన్నుతో పాటు 15 హాఫ్ సెంచరీలు న‌రైన్ ఖాతాలో ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 147కి పైగా ఉంది. ఇక ఐపీఎల్ లో ఇప్ప‌టివ‌ర‌కు 1,300కు పైగా పరుగులు చేశాడు.

Scroll to load tweet…

ఐపీఎల్ కు గ్లెన్ మాక్స్‌వెల్ గుడ్ బై.. టీ20 ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టులోనైనా ఉంటాడా?