Asianet News TeluguAsianet News Telugu

ఫ్లాప్ షో.. అవ‌కాశాల కొమ్మ‌ల‌ను న‌రికేసుకుంటున్న శుభ్‌మన్ గిల్.. !

Shubman Gill: వ‌రుసగా అవకాశాలు లభిస్తున్నా శుభ్‌మన్ గిల్ సూపర్‌ఫ్లాప్ అవుతున్నాడు. వన్డే, టీ20 క్రికెట్‌లో సూపర్‌హిట్‌ ప్లేయ‌ర్ గా గుర్తింపు సాధించిన ఈ యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ టెస్టు క్రికెట్‌లో మాత్రం పూర్తిగా ఫ్లాప్ షో కొన‌సాగిస్తున్నాడు.
 

Shubman Gill is chopping off the branches of opportunity, Gill Test Cricket Flop show RMA
Author
First Published Feb 3, 2024, 4:28 PM IST | Last Updated Feb 3, 2024, 4:28 PM IST

Shubman Gill Flop Show-Test Cricket: టీమిండియా యంగ్ స్టార్ ప్లేయ‌ర్ శుభ్ మన్ గిల్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. వ‌చ్చిన అవ‌కాశాల కొమ్మ‌ల‌ను తానే న‌రికేసుకుంటున్నాడు. ఇలాగే కొన‌సాగితే టీమిండియా చోటుద‌క్కించుకోవ‌డం కష్టమే. విశాఖపట్నంలో జ‌రుగుతున్న తొలి రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో శుభ్‌మన్ గిల్ కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు. అత‌ని నుంచి భారీ స్కోర్ల‌ను ఆశిస్తుండ‌గా, వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతూనే ఉన్నాడు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వెటరన్ బౌలర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో గిల్ ఔటయ్యాడు. అంత‌కుముందు తొలి టెస్టులో భార‌త్ ఓడింది. ఆ మ్యాచ్ లో  కూడా  శుభ్‌మన్ గిల్  పెద్ద‌గా ప‌రుగుతు చేయ‌లేదు. అయితే, రెండో టెస్టులో రాణిస్తాడ‌ని భావించినా ఫలితం లేకపోయింది. గిల్ సూప‌ర్ ఫ్లాప్ షో ను కొన‌సాగించాడు. వ‌రుస అవ‌కాశాలు ఇస్తున్నా రాణించ‌క‌పోవ‌డంతో గిల్ ను జ‌ట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ కూడా పెరుగుతుండ‌టంతో అత‌ని టెస్టు కెరీర్ పై తీవ్ర ప్రభావం ప‌డే అవ‌కాశ‌ముంది.

బూమ్ బూమ్ బుమ్రా.. యార్కర్లల దెబ్బకు ఎగిరిప‌డుతున్న ఇంగ్లాండ్ వికెట్లు !

భార‌త్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో కూడా శుభ్ మ‌న్ గిల్ నిరాశ‌ప‌రిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 66 బంతులు ఎదుర్కొని కేవలం 23 పరుగులకే చేసి ఔటయ్యాడు. టామ్ హార్ట్లీ బౌలింగ్ లో చెత్త షాట్ ఆడి పెవిలియ‌న్ కు చేరాడు. ఇక‌ రెండో ఇన్నింగ్స్ లో ఖాతా తెర‌వ‌కుండానే డ‌కౌట్ గా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ సిరీస్ ప్రారంభానికి ముందు ద‌క్షిణాఫ్రికాతో భార‌త్ రెండు మ్యాచ్ టెస్టు సిరీస్ ఆడింది. అయితే, ఈ రెండు మ్యాచ్ ల‌లో కూడా శుభ్‌మన్ గిల్ పెద్ద‌గా రాణించ‌లేదు. వన్డే క్రికెట్, టీ20 క్రికెట్ లో హిట్ గా నిలుస్తున్న గిల్.. టెస్టు క్రికెట్ లో మాత్రం ఫ్లాప్ షో చూపిస్తున్నాడు.

ఇంగ్లాండ్ పై డ‌బుల్ సెంచ‌రీతో య‌శ‌స్వి జైస్వాల్ సాధించిన టాప్-5 రికార్డులు

శుభ్‌మన్ గిల్ టెస్టు క్రికెట్ గ‌ణాంకాలను పరిశీలిస్తే 22 టెస్టుల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 29.65 సగటుతో 1097 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గిల్ టెస్టు క్రికెట్‌లో ఫ్లాప్ అయినప్పటికీ వన్డే, టీ20 క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్నాడు. వన్డే క్రికెట్‌లో అతని రికార్డును పరిశీలిస్తే, గిల్ 44 వన్డే మ్యాచ్‌లలో 103.46 స్ట్రైక్ రేట్‌తో 2271 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో 6 సెంచ‌రీలు సాధించాడు. అలాగే, 13 అర్ధ సెంచరీల కూడా ఉన్నాయి.

అండర్‌-19 ప్రపంచకప్ లో సెమీస్ చేరిన భార‌త్


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios