Asianet News TeluguAsianet News Telugu

అండర్‌-19 ప్రపంచకప్ లో సెమీస్ చేరిన భార‌త్

ICC Under 19 World Cup 2024: అండర్‌-19 ప్రపంచకప్ లో నేపాల్ పై భార‌త్ ఘ‌న విజయం సాధించి సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఐసీసీ అండర్‌-19 వ‌ర‌ల్డ్ క‌ప్-2024 లో భార‌త్ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన అన్ని మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించ‌డం విశేషం. 
 

India enter semi-finals of U19 World Cup 2024 with victory over Nepal as young Indian players smashed centuries RMA
Author
First Published Feb 3, 2024, 12:33 PM IST

 ICC Under 19 World Cup 2024: ఐసీసీ అండర్-19 ప్ర‌పంచ క‌ప్ లో టీమిండియా జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన అన్ని మ్యాచ్ ల‌లో గెలిచిన యంగ్ ఇండియా సెమీస్ లోకి అడుగుపెట్టింది. రికార్డు స్థాయిలో 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన భారత్ ఈసారి అండర్ -19 ప్రపంచకప్ టోర్నీలో సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. సూపర్-6 దశ చివరి మ్యాచ్‌లో నేపాల్‌పై టీమిండియా 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

4 మ్యాచ్‌ల్లో గెలిచి 8 పాయింట్లతో గ్రూప్-1లో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్న భారత్.. సూప‌ర్ సిక్స్ లో టాప్-2 స్థానాన్ని ఖాయం చేసుకుని సెమీస్‌లోకి ప్రవేశించింది. పాకిస్థాన్‌కు 6 పాయింట్లు, బంగ్లాదేశ్‌కు 4 పాయింట్లుతో  ఉండ‌గా, ఇంకా ఒక్కో మ్యాచ్ ఆడ‌నున్నాయి.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ ఉదయ్ సహారన్, సచిన్ దాస్ సెంచరీలతో 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత ఉదయ్-సచిన్ 4వ వికెట్‌కు 215 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సచిన్ 116 పరుగుల వద్ద అవుట్ కాగా, ఉదయ్ 100 పరుగులు చేశాడు. గుల్షన్ 3 వికెట్లు తీశాడు.

య‌శ‌స్వి జైస్వాల్ తొలి డబుల్ సెంచ‌రీ.. భార‌త 2వ ఓపెన‌ర్‌గా స‌రికొత్త రికార్డు

భారీ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన నేపాల్‌.. భార‌త్ బౌలింగ్ దెబ్బ‌కు పెద్ద‌గా  ప‌రుగులు చేయ‌కుండానే కుప్ప‌కూలింది. 50 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు మాత్ర‌మే చేసింది నేపాల్. సౌమీ పాండే 10 ఓవర్లలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.

స్కోర్లు: 
భారత్ 297/5 (సచిన్ 116, ఉదయ్ 100, గుల్షన్ 3-56)
నేపాల్ 165/9 (దేవ్ 33, సౌమీ పాండే 4-29)

సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో ఫైట్?

గ్రూప్-1లో భారత్ 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. పాకిస్థాన్‌కు 6 పాయింట్లు ఉన్నాయి, చివరి మ్యాచ్‌లో గెలిచినా నెట్‌రేట్‌లో భారత్‌ను అధిగమించే అవకాశం చాలా తక్కువ కాబ‌ట్టి భార‌త్ ఈ గ్రూప్ నుంచి టాప్ లో నిలుస్తుంది. గ్రూప్-2లో 2వ స్థానంలో ఉన్న ద‌క్షిణాఫ్రికాతో సెమీస్‌లో భారత్ త‌ల‌ప‌డే అవకాశ‌ముంటుంది.

India vs England: వైజాగ్ టెస్టులో దుమ్మురేపిన య‌శ‌స్వి జైస్వాల్.. రికార్డు డబుల్ సెంచరీ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios