Asianet News TeluguAsianet News Telugu

గెలిపిస్తానని ఫోన్‌ చేసింది.. అన్నంత పనిచేసింది: శిఖా పాండే తండ్రి

బలమైన న్యూజిలాండ్ జట్టుతో విజయంలో కీలక భూమికి పోషించిన పేసర్ శిఖ పాండే చివరి బంతికి అపూర్వ విజయాన్ని అందించింది. దీంతో శిఖాను అభిమానులు, క్రికెటర్లు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 

Shikha Pandey father Subhash Pandey comments on his daughter performance against new zealand
Author
Mumbai, First Published Feb 28, 2020, 6:48 PM IST

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన భారత జట్టు నేరుగా సెమీఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.

క్రీడాకారిణులు తమ తమ స్థాయికి తగ్గ ఆటతో జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నారు. బలమైన న్యూజిలాండ్ జట్టుతో విజయంలో కీలక భూమికి పోషించిన పేసర్ శిఖ పాండే చివరి బంతికి అపూర్వ విజయాన్ని అందించింది. దీంతో శిఖాను అభిమానులు, క్రికెటర్లు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Also Read:కివీస్ పై గెలుపు: నేరుగా సెమీ పైనల్లోకి దూసుకెళ్లిన ఇండియా

తాజాగా శిఖా తండ్రి సుభాష్ పాండే సైతం కూతురిని ప్రశంసలతో ముంచేశారు. మ్యాచ్‌కు ముందు తన కుమార్తె ఫోన్ చేసి మాట్లాడిందని... తాను ఈ మ్యాచ్‌లో భారత జట్టును గెలిపించాలనుకుంటున్నాని చెప్పింది. అన్నట్లుగానే తన బిడ్డ చివరి ఓవర్‌లో అద్భుతం చేసిందని సుభాష్ గర్వంగా చెప్పారు.

శిఖా వైవిధ్యమైన బౌలర్ అని, డెత్ ఓవర్లలో ఆమె చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తుందని సుభాష్ తెలిపారు. కీలక సమయాల్లో ఆఫ్ కట్టర్స్, ఇన్‌స్వింగ్ యార్కర్స్ లాంటి వైవిధ్యమైన బంతులు వేయగలదని తెలిపారు.

Also Read:ధోనీ దేశం కోసం చాలా చేశాడు.. టీ20 వరల్డ్ కప్ ఆడాలంటే... కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో శిఖా అదరగొడుతోందని టీమిండియా బౌలింగ్ కోచ్ సుబ్రోతో బెనర్జీ శిక్షణలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోందని సుభాష్ వెల్లడించారు.

న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్‌లో 6 బంతులకు 16 పరుగులు కావాల్సిన స్థితిలో బౌలింగ్‌కు దిగిన శిఖా పాండే అద్భుతంగా బంతులు వేసి జట్టును గెలిపించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios