టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలోకి అడుగుపెట్టి చాలా కాలమైంది. ఆయన తిరిగి జట్టులోకి ఎప్పుడు అడుగుపెడతారా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కనీసం ఈ ఏడాది  అక్టోబర్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లోనైనా ధోనీకి జట్టులో చోటు దొరుకుతుందా అనే విషంయపై ఇప్పటి వరకు సందిగ్ధత తొలగలేదు.

ఈ నేపథ్యంలో ధోనీ భవిష్యత్తుపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ధోనీ ప్రపంచకప్ లో పాల్గొనాలంటే... వీలైనన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడాలని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. మరో నెల రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవుతుండగా.. తాజాగా కపిల్ దేవ్ మీడియాతో మాట్లాడారు.

ఐపీఎల్ ధోనీ ఒక్కడే ఆడట్లేదన్నారు. మరో పదేళ్లపాటు దేశం గర్వించే ఆటగాళ్లు జట్టులో ఉండాలని కోరుకునేవాళ్లలో తాను కూడా ఒకడినని పేర్కొన్నారు. ధోనీ దేశం కోసం ఇప్పటికే చాలా చేశాడన్నారు.  ఒక అభిమానిగా ధోనీ టీ20 వరల్డ్ కప్ లో ఆడాలని తాను కోరుకుంటానని చెప్పాడు. అయితే... ఒక క్రికెటర్ గా మాత్రం జట్టు యాజమాన్య నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని చెప్పాడు.

Also Read పిచ్ రోలర్ డ్రైవ్ చేస్తూ ఎంఎస్ ధోనీ: వీడియో వైరల్...

ధోనీ ఇప్పటికే చాలాకాలం ఆటకు దూరమయ్యానని చెప్పాడు. అక్టోబర్ లో ప్రారంభమయ్యే మెగా సమరంలో ఆడాలంటే ఇకపై  చాలా మ్యాచులు ఆడాల్సి ఉందన్నాడు. ప్రస్తుతం ధోనీ కెరిర్ చివరి దశలో ఉందని అభిప్రాయడపడ్డాడు. అభిమానిగా ధోనీని ఐపీఎల్ లో చూడాలని ఆత్రుతగా ఉందన్న ఆయన తన ఓటు మాత్రం కొత్త తరానికే వేస్తానని చెప్పాడు. 

అనంతరం కివీస్ పర్యటనలో పూర్తిగా విఫలమైన బుమ్రా, విరాట్ కోహ్లీలపై కూడా కపిల్ దేవ్ స్పందించాడు.  ఆటగాళ్లు గాయపడి కోలుకున్నప్పుడు శరీరానికి తగిన సమయం అవసరమని.. దానికెంతో సమయం పట్టదన్నారు. బుమ్రా మళ్లీ తిరిగి ఫామ్ లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అదేవిధంగా విరాట్ కోహ్లీ కూడా పుంజుకుంటాడని చెప్పారు.