భారత క్రికెట్ కామెంటేటర్లలో సంజయ్ మంజ్రేకర్ ఒకరు. తనదైన శైలిలో విశ్లేషణతో ఆయన అభిమానులు, క్రీడా ప్రముఖుల నుంచి మంచి గుర్తింపు పొందారు. ఆయన కామెంటరీకి ఎందరో అభిమానులు ఉన్నారు.

అయితే సంజయ్ ముంబై ఆటగాళ్లపై అతి ప్రేమ చూపిస్తాడని.. మిగిలిన ప్లేయర్స్‌ను కించపరుస్తాడంటూ మంజ్రేకర్‌పై గతంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన బీసీసీఐ కామెంటరీ ప్యానల్‌లో చోటు కోల్పోయాడు.

Also Read:యూఏఈలో ఐపీఎల్: కోహ్లీ కొత్త కిట్... ఈసారైనా ట్రోఫీ ఖాయమేనా అంటున్న ఫ్యాన్స్

ఈ క్రమంలో సంజయ్ తనపై ఎందుకు వేటు పడిందో మీడియాకు తెలిపాడు. తన కెరీర్‌లో ఇప్పటి వరకు తాను ఎవరిని కావాలని కించపరచలేదని వివరణ ఇచ్చాడు. కొందరు ఆటగాళ్లకు తాను నచ్చకపోవడం వల్లనే తనను తప్పించారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించాడు. త్వరలోనే ఐపీఎల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో తనను మళ్లీ కామెంటరీ ప్యానల్‌లోకి తీసుకోవాల్సిందిగా మంజ్రేకర్ బీసీసీఐ లేఖ రాశారు.

Also Read:ఐపీఎల్ కి అభిమానులకు ఎంట్రీ, ప్రభుత్వ అనుమతే తరువాయి..!

గతంలో బోర్డు మార్గదర్శకాలు పాటించడంలో పొరపాటు జరిగిందని.. అయితే ఇకపై అలాంటివి జరగకుండా చూసుకుంటానని సదరు లేఖలో సంజయ్ హామీ ఇచ్చాడు.