టీమిండియా మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తాడు. వివరాల్లోకి వెళితే.. కార్చిచ్చు కారణంగా ఆస్ట్రేలియాలో లక్షలాది మంది నిరాశ్రయులు కాగా.. పెద్ద సంఖ్యలో వన్య ప్రాణులు అగ్గికి ఆహుతయ్యాయి.

Also Read:15 నిమిషాల ఆట, అతనిలో నేను కనిపిస్తున్నా: ఆ బ్యాట్స్‌మెన్‌పై సచిన్ ప్రశంసలు

వీరిని ఆదుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఛారిటీ గేమ్‌కు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో పాల్గొనేందుకు గాను సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్‌లు శుక్రవారం సిడ్నీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌ను పరిశీలించిన మాస్టర్ బ్లాస్టర్.. డ్రెసింగ్ రూమ్‌ను సందర్శించి గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.

అక్కడితో ఆగకుండా కొన్ని ఫోటోలు దిగి.. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీటిని యువరాజ్ సింగ్ తీయడం విశేషం. ‘‘ఎస్‌సీజీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇదే తన ఫేవరేట్ కార్నర్.. నాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అంటూ ఫోటోలకు క్యాప్షన్ పెట్టాడు. 

Also Read:కొత్త రోల్: వారికి పానీపూరీలు సర్వ్ చేసిన ధోనీ, వీడియో వైరల్

మరోవైపు కార్చిచ్చు బాధితుల కోసం శనివారం నిర్వహించాల్సిన మ్యాచ్‌ను ఆదివారం మెల్‌బోర్న్‌లోని జంక్షన్ ఓవల్ స్టేడియానికి మార్చారు. ఈ మ్యాచ్‌లో రికీ పాంటింగ్ లెవెన్‌కు సచిన్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. గిల్ క్రిస్ట్ లెవెన్‌కు వెస్టిండీస్ మాజీ పేసర్ కోట్నీ వాల్ష్ కోచ్. 

రికీ పాంటింగ్‌ లెవెన్‌: రికీ పాంటింగ్‌ (కెప్టెన్‌), మాథ్యూ హెడెన్‌, జస్టిన్‌ లాంగర్‌, ఎలీస్‌ విలానీ, బ్రియాన్‌ లారా, పోబీ లిచ్‌ఫీల్డ్‌, బ్రాడ్‌ హాడిన్‌ (వికెట్‌ కీపర్‌), బ్రెట్‌ లీ, వసీం అక్రమ్‌, డాన్‌ క్రిస్టియన్‌, లూక్‌ హాడ్జ్‌.
 
గిల్‌క్రిస్ట్‌ లెవెన్‌: ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), షేన్‌ వాట్సన్‌, బ్రాడ్‌ హాడ్జ్‌, యువరాజ్‌ సింగ్‌, అలెక్స్‌ బ్లాక్‌వెల్‌, ఆండ్రూ సైమండ్స్‌, నిక్‌ రివోడ్ట్‌, పీటర్‌ సిడిల్‌, ఫవాద్‌ అహ్మద్‌, టిమ్‌ పెయిన్‌. (ఒక ఆటగాడిని ఇంకా ప్రకటించాల్సి ఉంది).