ఒకే ఫ్రేమ్ లో స‌చిన్, ధోని, రోహిత్.. ఈ క్రికెట్ లెజెండ్స్ అస‌లు ఏం చేయాల‌నుకుంటున్నారు...?

Team India : క్రికెట్ లెజెండ్స్ మాస్ట‌ర్ బ్లస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ఇక హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌లు ఒకే ఫ్రేమ్ లో మెరిశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైర‌ల్ గా మారాయి. 
 

Sachin Tendulkar, MS Dhoni and Rohit Sharma in the same frame. What do these cricketing legends want to do? RMA

Tendulkar - Dhoni - Rohit : ఒక‌రు అంత‌ర్జాతీయ క్రికెట్ లెజెండ్.. మ‌రొక‌రు భార‌త జ‌ట్టు మాజీ దిగ్గ‌జ కెప్టెన్ ఎంఎస్ ధోని, మ‌రోక‌రు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ‌..  ఈ ముగ్గురు క్రికెట్ మోన‌గాళ్లు ఒకే ఫ్రేమ్ లో క‌నిపిస్తే క్రికెట్ ల‌వ‌ర్స్ కు పండగే.. అదే ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ముగ్గురు భార‌త క్రికెట్ స్టార్లు ఒకే ఫ్రేమ్ లో ఉన్న దృశ్యాలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. కాగా, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ఇద్దరూ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే, ధోని ఐపీఎల్ లో ఆడుతున్నాడు. త్వరలో ఐపీఎల్  కు కూడా గుడ్ బై చెప్ప‌వ‌చ్చు.. అది ఇదే సీజ‌న్ కావ‌చ్చు లేదా మ‌రో సీజ‌న్ కావ‌చ్చు. ప్రస్తుతం రోహిత్ శర్మ మాత్రమే ఐపీఎల్ స‌హా అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడు.

ఇదిలావుండ‌గా, ప్రస్తుత సంవత్సరం ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024 మార్చి 22న అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. చెన్నై వేదికగా ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ క్రికెట్ ల‌వ‌ర్స్ కు థ్రిల్ ను పంచుతూనే ఉంది. ఇప్పటి వరకు సీఎస్కే ఆడిన 5 మ్యాచ్‌లలో 3 గెలిచి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. అలాగే ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది.  ఇక ఐపీఎల్ 2024 29వ మ్యాచ్ లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ త‌ల‌ప‌డ్డాయి. ఇందుకోసం ఇరు జట్లు ముంబైలో విడిది చేశాయి.

DC vs LSG Highlights : ల‌క్నోను దెబ్బ‌కొట్టిన కుల్దీప్.. అదరగొట్టిన జేక్ ఫ్రేజర్.. ఢిల్లీ గెలుపు

 

ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలు ముంబైలోని ఓ హోటల్‌లో కూర్చుని సరదాగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫ్రేమ్ లో క‌నిపిస్తున్న దృశ్యాలు గ‌మ‌నిస్తే.. ఇందులో ఆశ్చర్యకరంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించారు. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ నుంచి ఎంఎస్ ధోనీని తప్పించారు. సచిన్ టెండూల్క‌ర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ ముగ్గురు స్టార్లు ఉన్న ఈ ఫోటోను ధోని రైనా ఫ్యాన్స్ క్లబ్ పేజీలో షేర్ చేయ‌డంతో వైర‌ల్ గా మారింది.

 

 
KULDEEP YADAV : దాని కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాను.. కుల్దీప్ ఎమోష‌న‌ల్..

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios