మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్‌కు సెక్యూరిటీని ఉపసంహరిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. సచిన్‌కు 24 గంటలపాటు పోలీస్ కానిస్టేబులళ్లతో ఎక్స్‌ కేటగిరీ కింద ప్రభుత్వం భద్రత కల్పించింది.

అయితే కొద్దిరోజుల క్రితం టెండూల్కర్‌ భద్రతను సమీక్షించిన పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు కల్పించిన ఎక్స్‌ గేటగిరీ భద్రతను తొలగించాలని నిర్ణయించారు. అయితే భద్రతను తొలగించినప్పటికీ.. సచిన్ వెంట ఎస్కార్ట్ మాత్రం ఉంటుందని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.

Also Read:ఝార్ఖండ్ లో కూడా శరద్ పవార్ వేలు... మరో మహారాష్ట్ర?

అదే సమయంలో సీఎం కుమారుడు ఆదిత్య థాక్రేకు జడ్ కేటగిరి భద్రతను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదిత్యకు గతంలో వై కేటగిరీ భద్రత ఉండేది. అలాగే బీజేపీ నేత ఏక్‌నాథ్ ఖడ్సేకు ఉన్న వై కేటగిరీ భద్రతతో పాటు ఎస్కార్ట్‌ను కుదించారు.

బీజేపీ సీనియర్ నేత, మాజీ యూపీ గవర్నర్ రాంనాయక్‌కు వున్న జడ్‌ప్లస్ కేటగిరీని ఎక్స్‌కు తగ్గించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికంకు ఉన్న జడ్‌ప్లస్ కేటగిరి భద్రతను వై కేటగిరికి తగ్గించారు.

Also Read:రుణభారం, నిరుద్యోగం: చుట్టూ సమస్యలు.. హేమంత్‌కు కత్తిమీద సామే

మహారాష్ట్రలో మొత్తం 97 మంది నాయకులకు ఉన్నత సెక్యూరిటీ ఉండగా.. 29 మంది నేతలకు భద్రతను పున: సమీక్షించి, సెక్యూరిటీని కుదించగా... మరికొందరికి భద్రతను పెంచారు.