Asianet News TeluguAsianet News Telugu

రోహిత్ శ‌ర్మ‌ ధోని మంత్రాన్ని పాటించాలి.. హిట్‌మ్యాన్ కు సీనియ‌ర్ స‌ల‌హా !

Rohit Sharma: భారత్-ఇంగ్లాండ్ మధ్య రాజ్ కోట్ వేదిగా మూడో టెస్టు జ‌ర‌గ‌నుంది. టెస్టు సిరీస్ క్ర‌మంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గురించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. రోహిత్ ఎంఎస్ ధోని మంత్రాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
 

Rohit Sharma should follow ms dhoni's mantra, Sanjay manjrekar's advice to hitman RMA
Author
First Published Feb 10, 2024, 5:23 PM IST | Last Updated Feb 10, 2024, 5:23 PM IST

IND vs ENG - Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గ‌త రెండు టెస్టుల్లో భారీ స్కోర్ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవ‌డం పై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. నాలుగు ఇన్నింగ్స్ ల‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. సిరీస్ లో తొలి టెస్టు మ్యాచ్ లో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో హిట్ మ్యాన్ ఔటయ్యాడు. రెండో టెస్టులో కూడా ఆలానే ఔట్ అయ్యాడు. ఈ క్ర‌మంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్, మూడు ఫార్మాట్ ల‌లో భారత్ కు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఎంఎస్ ధోని గురించి ప్ర‌స్తావిస్తూ.. ధోనీ మంత్రాన్ని రోహిత్ శ‌ర్మ‌ అనుసరించాలని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. "రోహిత్ శర్మ కెప్టెన్ గా ప్రభావం చూపే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడా? అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే బ్యాట్ తో పెద్ద స్కోర్లు చేయ‌లేదు. రోహిత్ శర్మ మొదట బ్యాట్స్ మన్ గా, ఆ తర్వాత కెప్టెన్ గా ఉండాలి ఎందుకంటే మీరు కెప్టెన్ గా ఉన్నప్పుడు చాలా విషయాలు మీ నియంత్రణలో ఉండవు. ఈ విష‌యంలో ధోనీ మంత్రాన్ని అనుసరించాలి" అని అన్నాడు.

MS Dhoni: మాట‌లు కాదు బాసు చేత‌లు ముఖ్యం.. అవి మ‌న ప్ర‌వ‌ర్త‌న‌తోనే వ‌స్తాయి.. ! 

రోహిత్ శ‌ర్మ క్రికెట్ లో ఎంఎస్ ధోనీ మంత్రాన్ని అనుసరించాలనీ, భారత మాజీ కెప్టెన్ ధోని ఫలితం కోసం తొందరపడకుండా ఈ ప్రక్రియపై ఆధారపడేవాడని మంజ్రేక‌ర్ అన్నాడు. 'సరైన పనులు చేయడానికి ప్రయత్నించండి, ఎంఎస్ ధోనీ మాటలను అనుసరించండి. మీరు ప్రాసెస్ చేస్తారు.. విషయాలు జరిగే వరకు వేచి ఉంటారు, కానీ బ్యాటింగ్ అనేది వారి నియంత్రణలో ఉంటుందని' అన్నాడు. అలాగే, రోహిత్ శ‌ర్మ పాత ఫామ్ ను అందుకోవాల‌ని సూచించాడు. మునుప‌టిలా  టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బ్యాట్స్ మన్ లా రోహిత్ రావాలని అన్నాడు. కాగా, ఫిబ్రవరి 15 నుంచి రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది.

SA20 2024 FINAL: సన్‌రైజర్స్‌ రెండోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందా? కీలకం కానున్న టాస్.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios