SA20 2024 Final: సన్‌రైజర్స్ రెండోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందా? కీలకం కానున్న టాస్.. !
SA20 2024 Final: సౌతాఫ్రికా టీ20 లీగ్ (ఎస్ఏ20) లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ Vs డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య ఫైనల్ కు అంతా సిద్ధమైంది. ఐడెన్ మార్క్‌రామ్ నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ ఎస్ఈసీ మరోసారి ఛాంపియన్‌గా నిలవాలని చూస్తోంది.
SA20 2024 Final- DSG vs SEC: దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20) తుదిదశకు చేరుకుంది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ క్యాప్-డర్బన్ సూపర్‌జెయింట్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇది ఎస్ఏ20 లీగ్ సెంకండ్ సీజన్. అంతకుముందు, ఐడెన్ మార్క్‌రామ్ సారథ్యంలోని సన్‌రైజర్స్ SA20 లీగ్ తొలి సీజన్‌లో టైటిల్ గెలుచుకుంది. వరుసగా రెండోసారి ఫైనల్స్‌కు చేరుకున్న ఈ టీమ్ మరోసారి టైటిల్ లు గెలుచుకోవాలని చూస్తోంది.
డర్బన్ కు ఇది మొదటి ఫైనల్. క్వాలిఫయర్-1లో డర్బన్‌ను ఓడించి సన్‌రైజర్స్ ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే, డర్బన్ ఎలిమినేటర్‌లో జోబర్గ్ సూపర్‌కింగ్స్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. మరోసారి డర్బన్ సూపర్ జెయింట్స్ ను మట్టి కరిపించి టైటిల్ దక్కించుకోవాలని ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలోని సన్‌రైజర్స్ చూస్తోంది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఏడు విజయాలు, రెండు ఓటములతో గ్రూప్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. జట్టు అన్ని విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేసింది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో సత్తా చాటింది.
జట్టు తరఫున జోర్డాన్ హార్మన్ అత్యధిక పరుగులు చేయగా, ఒట్నీల్ బార్ట్‌మన్ టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. మ్యాచ్‌కు ముందు ఆ జట్టు బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ మాట్లాడుతూ.. జట్టు ఫైనల్ విజయం పై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అలాగే, సన్‌రైజర్స్ కెప్టెన్ ఐడాన్ మార్క్రామ్ మాట్లాడుతూ.. 'మాకు విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం దొరికింది. శక్తిని తిరిగి పొందడానికి శుక్రవారం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాము. గతేడాది కప్ గెలిచాం. ఇప్పుడు గెలుస్తాం.. మ్యాచ్ గొప్పగా ఉంటుంది.. మేము మరింత ఉత్సాహంగా గేమ్ కోసం చూస్తున్నామని తెలిపాడు.
డర్బన్ కెప్టెన్ కేశవ్ మహారాజ్ మాట్లాడుతూ.. తప్పకుంగా విజయం సాధిస్తామనీ, తాము ఫైనల్ కోసం ఉత్సాహంగా ఉన్నామని చెప్పాడు. జోబర్గ్ సూపర్‌కింగ్స్‌పై విజయంతో ఫైనల్ చేరుకున్నామనీ, క్వాలిఫయర్-2లో అద్భుత ప్రదర్శన చేశాని చెప్పాడు. ప్రస్తుతం ఫైనల్ గేమ్ ప్లాన్ పై దృష్టి పెట్టామనీ, ఎత్తుపల్లాలతో సాగిన మా ప్రయాణం ఇక్కడి వరకు వచ్చిందనీ, ఫైనల్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
Virat Kohli: 13 ఏళ్ల కెరీర్‌లో ఇదే తొలిసారి.. విరాట్ కోహ్లీ కోరినందుకే ఇలా.. !
పిచ్ రిపోర్టు ఏం చెబుతోంది..?
పిచ్‌పై పచ్చిక ఉండటం ఫాస్ట్ బౌలర్‌లకు అనుకూలమైన పరిస్థితులను సూచిస్తుంది. దీంతో స్వింగ్, బౌన్స్‌ను ఊహించవచ్చు. పిచ్ అంచనా ప్రకారం, టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న జట్టుకు అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇరు జట్లు :
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్: జోర్డాన్ హర్మాన్, డేవిడ్ మలన్, టామ్ అబెల్, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్ (వికెట్ కీపర్), పాట్రిక్ క్రూగర్, లియామ్ డాసన్, మార్కో యాన్సన్, సైమన్ హార్మర్, ఒట్నీల్ బార్ట్‌మన్, డేనియల్ వోరాల్.
డర్బన్ సూపర్ జెయింట్స్: మాథ్యూ బ్రెట్జ్కీ, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), భానుకా రాజపక్స, హెన్రిక్ క్లాసెన్, జెజె స్మట్స్, డ్వేన్ ప్రిటోరియస్, వేన్ ముల్డర్, కేశవ్ మహరాజ్ (కెప్టెన్), రీస్ టోప్లీ, జూనియర్ డాలా, నవీన్-ఉల్-హక్.
20 ఫోర్లు 8 సిక్సర్లతో శ్రీలంక క్రికెటర్ విధ్వంసం.. వన్డేల్లో మరో డబుల్ సెంచరీ !