IND vs SA Final : టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి 17 సంవత్సరాల తర్వాత టీ20 క్రికెట్ ఛాంపియన్‌గా నిలిచింది. రెండో సారి ఐసీసీ టీ20 ట్రోఫీని అందుకుంది.
India become Champions of T20 World Cup 2024 : దక్షిణాఫ్రికాను ఓడించి టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 ఛాంపియన్ గా నిలిచింది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుని టైటిల్‌ను కైవసం చేసుకుంది. 17 ఏళ్ల తర్వాత భారత్ చాంపియన్‌గా నిలిచింది. విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ సూపర్ బ్యాటింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్, హార్దిక్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్ తో టీ20 ప్రపంచ కప్ 2024 భారత జట్టు ఛాంపియన్ గా నిలిచింది. రెండో సారీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను గెలుచుకుంది. ధోని తర్వాత భారత్ కు టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని అందించిన కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. అయిగే, దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో భారత్ రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. అంతకుముందు 2007లో ఎంఎస్ కెప్టెన్సీ లో టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకుంది. భారత జట్టుకు టీ20 ప్రపంచ కప్ ను అందించిన ఇద్దరు కెప్టెన్లు ధోని, రోహిత్ శర్మ.
టీ20 ప్రపంచ కప్ 2024 ప్రైజ్ మనీ ఎంత? విన్నర్, రన్నరఫ్ జట్లు ఎంత అందుకుంటాయి?
భారత బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతం చేశాడు. ఈ ప్రపంచ కప్ లో పేలవ ఫామ్ తో ముందుకు సాగిన విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్ లో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్ వికెట్లు పడి టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో అక్షర్ పటేల్ తో కలిసి భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు విరాట్ కోహ్లీ. కింగ్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీకి తోడుగా అక్షర్ పటేల్ 47 పరుగులు, శివమ్ దూబే 27 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, ఎన్రిచ్ నార్కియాలు చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు.
177 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ గెలిచే విధంగానే అనిపించినా.. కీలక సమయంలో బుమ్రా, హార్దిక్ పాండ్యాలు వికెట్లు తీయడంతో మ్యాచ్ భారత్ వైపు వచ్చింది. ఆఫ్రికన్ జట్టులో హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 52 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. క్వింటన్ డి కాక్ 39, ట్రిస్టన్ స్టబ్స్ 31 పరుగులు చేశారు. భారత్ తరఫున హార్దిక్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలు చెరో రెండు వికెట్లు తీశారు. 2-2 వికెట్లు తీశారు.
చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన రెండో టీమ్‌గా భారత్ నిలిచింది. అంతకుముందు రెండు సార్లు టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకున్న వెస్టిండీస్‌ను సమం చేశాడు. వెస్టిండీస్ జట్టు 2012, 2016లో టైటిల్‌ను గెలుచుకుంది. భారత జట్టు 2007, 2024 లో ఐసీసీ టీ20 క్రికెట్ ఛాంపియన్ గా నిలిచింది.
ఫైనల్లో విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్.. లేకపోతే టీమిండియా సంగతి అంతే.. !
