గాయంతో రిషబ్ పంత్ ఫట్: కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్
ఆస్ట్రేలియాపై జరుగుతున్న తొలి వన్డే మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. దాంతో రిషబ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ కు దిగాడు. మనీష్ పాండే ఫీల్డింగ్ కు దిగాడు.
ముంబై: వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాపై మంగళవారం జరుగుతున్న తొలి వన్డే మ్యాచులో రిషబ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. యువవికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడడంతో కేఎల్ రాహుల్ అతని బాధ్యతలను తీసుకున్నాడు.
బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ బంతి రిషబ్ పంత్ హెల్మెట్ కు బలంగా తాకింది. దాంతో అతని తల భాగంలో స్వల్పంగా గాయమైంది. దీంతో రెండో ఇన్నింగ్సు నుంచి రిషబ్ పంత్ తప్పుకున్నాడు. రిషబ్ పంత్ ఆటకు దూరం కావడంతో మనీష్ పాండే మైదానంలోకి దిగి ఫీల్డింగ్ చేస్తున్నాడు.
Also Read: లోయర్ మిడిల్ ఆర్డర్ లో కోహ్లీ బ్యాచ్ చెత్త ప్రయోగాలు
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదు బంతులు మిగిలి ఉండగానే వికెట్లను అన్నింటినీ పారేసుకుంది. 49.1 ఓవర్లలో 255 పరుగులు చేసింది. బ్యాటింగ్ లో శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ తప్ప మిగతావారెవరూ రాణించలేదు.
రిషబ్ పంత్ 33 బంతులు ఆడి 28 పరుగులు చేశాడు. కమిన్స్ బౌలింగులో అతను అవుటయ్యాడు. కుల్దీప్ యాదవ్ 15 బంతుల్లో 17 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశాడు.
Also Read: సిక్స్ కొట్టిన విరాట్ కోహ్లీకి ఆడమ్ జంపా రిటర్న్ గిఫ్ట్