ఆక్లాండ్: న్యూజిలాండ్ పై జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పోరాట పటిమ వృధా అయింది. రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ ఇండియాను గెలిపించినంత పనిచేశారు. కానీ, చివరలో జడేజా అవుట్ కావడంతో ఇండియా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

అయితే, జడేజా 55 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో అతను టీమిండియా మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీల రికార్డులను బద్దలు కొట్టాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి కపిల్ దేవ్, ధోనీ ఆరు అర్థ సెంచరీలు చేశారు.  కాగా ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి ఏడు అర్థ సెంచరీలు చేయడం ద్వారా ఆ రికార్డును సృష్టించాడు.

Also Read: కివీస్ పై సిరీస్ ఓటమి: విరాట్ కోహ్లీ ఓదార్పు మాటలు ఇవీ...

జడేజా 73 బంతుల్లో 55 పరుగులు చేసి ఇండియా టాప్ స్కోరర్ గా నిలిచాడు. జడేజాకు ఇప్పటి వరకు 12 అర్థ సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జడేజా, నవదీప్ సైనీతో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.  వన్డేల్లో న్యూజిలాండ్ పై 8 వికెట్ కు రెండో అత్యధిక భాగస్వామ్యం. 

నవదీప్ సైనీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 49 బంతుల్లో 45 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లందరినీ చితకబాదాడు. అతను ఐదు ఫోర్లు, రెండు సిక్స్ లు కొట్టాడు. 

Also Read: జడేజా సూపర్ త్రో... ఔరా అంటున్న నెటిజన్లు

గత ఆరేళ్లలో ద్వైపాక్షిక సిరీస్ లో న్యూజిలాండ్ ఇండియాను ఓడించడం ఇదే మొదటిసారి. 2014 జనవరిలో ఇండియాపై ద్వైపాక్షిక సిరీస్ ను గెలిచింది. 2016, 2017, 2019ల్లో జరిగిన మూడు సిరీస్ లను కూడా భారత్ గెలుచుకుంది.