ఆక్లాండ్‌: న్యూజిలాండ్, టీమిండియాల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ జట్టును రనౌట్ల శాపం వదిలేలా కనబడం లేదు. నేడు కొనసాగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్‌ ఒకటి కాదు ఏకంగా రెండు వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. 

ఈ రెండు కూడా ప్రధానమైన వికెట్లు కావడం న్యూజిలాండ్ ను బలమైన దెబ్బతీశాయని చెప్పవచ్చు. తొలుత మంచి ఫామ్ లో ఉండి భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న గుప్తిల్ రన్ అవుట్ రూపంలో వెనుదిరిగాడు. 

గప్టిల్‌ రనౌటైన కాసేపటికే న్యూజిలాండ్ వెంట వెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. .జేమ్స్‌ నీషమ్‌(3)ను జడేజా రనౌట్‌ చేసి పెవిలియన్ కి పంపించాడు. జడేజా రన్ అవుట్ నచేసిన విధానాన్ని చూసిన వారంతా ఔరా అని ముక్కున వేలేసుకోవడం తథ్యం. 

Also read: రెండో వన్డే: న్యూజిలాండ్ పై భారత్ లక్ష్యం 274 పరుగులు

నవదీప్‌ సైనీ వేసిన 35 ఓవర్లోని రెండవ బంతిని రాస్‌ టేలర్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ మీదుగా ఆడాడు. బంతిని తరలించిన వెంటనే టేలర్ సింగిల్‌కు యత్నించగా...  అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న జడేజా బ్యాటింగ్ ఎండ్‌ వైపుగా డైరెక్ట్ త్రో వేసి వికెట్లను గిరాటేసాడు.  

నీషమ్‌ క్రీజుకి చాలా దూరంగా ఉండగానే... జడేజా వేసిన అద్భుతమైన త్రోకు కివీస్‌ మరో వికెట్ ను కోల్పోవాలిసి వచ్చింది.  గ్రౌండ్ లో [పాదరసంలా కదిలి బంతిని అల్లంత దూరం నుంచి కూడా గురి తప్పకుండా స్టంప్స్ ని టార్గెట్ చేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఆనందోత్సహాల్లో మునిగిపోయారు. 

జడేజా గతంలో కూడా ఇలాంటి ఫీల్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శించిన విషయం తెలిసిందే. భారత జట్టులో జడేజా ఫీల్డింగ్ చేస్తున్నాడంటే... అవతలి టీం బ్యాట్స్ మెన్ సింగల్ తీయడానికి కూడా ఆచి తూచి పరుగెత్తుతారు. ఒకవేళ అతని వైపుగా బంతి గనుక వెళితే... టైట్ సింగల్ గా గనుక అనిపిస్తే, సింగల్ తీసే ఆలోచనను కూడా విరమించుకుంటారు.